ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు

ABN, Publish Date - Sep 11 , 2024 | 11:48 PM

నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఐదు రోజుల పాటు పూజలందుకున్న వినాయక విగ్రహాలను బుధవారం ఘనంగా నిమజ్జనం చేశారు.

గణనాధుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న భక్తులు

నంద్యాల (కల్చరల్‌), సెప్టెంబరు 11: నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఐదు రోజుల పాటు పూజలందుకున్న వినాయక విగ్రహాలను బుధవారం ఘనంగా నిమజ్జనం చేశారు. ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన, నందికొట్కూరు పట్టణాలతో పాటు నంద్యాల జిల్లా కేంద్రంలో వేడుకలు జరిగాయి. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో ఊరేగింపు నిర్వహించారు. నంద్యాల పట్టణంలో గణేశ కేంద్రసమితి ఆధ్వర్యంలో మొదటి వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. ముందుగా పరిపాలనా, రక్షణ గణపతులకు పూజలు నిర్వహించి ఉదయం 11:30 గంటలకు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎనఎండి ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా, డీఆర్వో పద్మజ, అసిస్టెంట్‌ కమిషనర్‌ అంకిరెడ్డి, చైర్‌పర్సన మాబున్నిసా, తహసీల్దార్‌ ప్రియదర్శిని, నంద్యాల డీఎస్పీ యుగంధర్‌బాబు, స్పెషల్‌ బ్రాంచ సీఐలు మోహనరెడ్డి, ఎరిషావలి, నంద్యాల ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునగుప్త, మున్సిపల్‌, రెవెన్యూ, విద్యుత శాఖ, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, గణేశ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాలలో చిన్నచెరువు, రాణిమహారాణి వద్ద గల కాలువ, బొమ్మలసత్రం వద్దగల కుందూనది, అయ్యలూరు మెట్టవద్ద గల కేసీ కెనాల్‌ వద్ద భక్తులు గణనాథులను నిమజ్జనం చేశారు. దాదాపు 400కు పైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీస్‌ బందోబస్తును నిర్వహించారు.

Updated Date - Sep 11 , 2024 | 11:48 PM

Advertising
Advertising