ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనుసంధానం

ABN, Publish Date - Nov 14 , 2024 | 01:20 AM

అనుకోని విపత్తు వచ్చింది. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఫ సచివాలయ సిబ్బందితో హౌస్‌హోల్డ్‌ జియో మ్యాపింగ్‌

ఫ విపత్తుల సమయంలో కీలకం కానున్న ట్యాగింగ్‌

ఫ ఆధార్‌, ఫొన్‌ నెంబర్లతో ప్రమాదంలో వున్నవారిని గుర్తించే వీలు

ఫ తద్వారా వారికి సహాయం అందించేలా చర్యలు

ఫ బ్యాంకు ఖాతాల ఆధార్‌ లింకేజీపైనా ప్రత్యేక డ్రైవ్‌

గుంటూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అనుకోని విపత్తు వచ్చింది. ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. వారిని వెదకడం కష్టంగా మారింది. అలాంటి సమయంలో వారిని ఎలా గుర్తించాలి? ఎలా సహాయం అందించాలి? ఎలా కాపాడాలి? ఎలాంటి కమ్యూనికేషన్‌ లేని అలాంటి విపత్కర సమయాల్లో బాధితులను గుర్తించి కాపాడడం ఎలా? ఇటీవల విజయవాడ వరద విపత్తు సమయంలో ప్రభుత్వానికి ఎదురైన సమస్య ఇది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నారు.. వారిని సమన్వయం చేసే ఏకైక వ్యవస్థ ఏంటి అనేదానిపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఒక వ్యక్తి పేరు, అతడి ఆధార్‌ నెంబరు, మొబైల్‌ నెంబరు లేదా ఇంటి నెంబరు.. ఇలా ఏదో ఒక నెంబరుతో వారి వివరాలు, వుండే ప్రాంతాన్ని కచ్ఛితంగా గుర్తించి వారికి సహాయం అందించేందుకు మార్గాన్ని కనుగొంది. అదే ‘హౌస్‌హోల్డ్‌ జియో ట్యాగింగ్‌!’ ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్‌ చేస్తే ఏదో ఒక చిన్న ఆధారంతో ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించి తక్షణ సహాయం అందించ వచ్చని భావించింది. వరదలో కొట్టుకుపోయేవారికి గడ్డిపోచ కూడా ఆసరాగా మారినట్లు ఈ జియో ట్యాగింగ్‌ విధానంలో ఒక చిన్న వివరం వారి కుటుంబ సభ్యులందరినీ రక్షించే అవకాశం కల్పించబోతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒక సారి జియో ట్యాగింగ్‌ అయితే తుఫానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఏదో ఒక చిన్న ఆధారంతో బాధితుల వివరాలు తెలుసుకుని వారికి సహాయం అందించవచ్చు. ఒక ఇంటికి సంబంధించి ఏ చిన్న వివరం తెలిసినా ఆన్‌లైన్లో వాటిని నమోదు చేస్తే మొత్తం వివరాలతోపాటు ఆ ఇంటి లొకేషన్‌ కూడా కళ్ల ముందు కనిపించేలా ఈ హౌస్‌హెల్డ్‌ జియో ట్యాగింగ్‌ను రూపొందిస్తోంది.

ప్రతి ఇంటికీ జియో ట్యాగింగ్‌..

కూటమి ప్రభుత్వం హౌస్‌హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ప్రభుత్వంతో అనుసంధానిస్తోంది. గతంలో సంక్షేమ పథకాల ఆధారంగా హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ ఉండేది. ఉదాహరణకు పింఛన్లకు సంబంధించి ఒక మ్యాపింగ్‌, రేషన్‌ కార్డులకు సంబంధించి మరో మ్యాపింగ్‌.. అలా ఆయా పథకాలకు సంబంధించిన మ్యాపింగ్‌ మాత్రమే వుండేది. ఫలితంగా ఆయా పథకాల పంపిణీకి మాత్రమే అవి ఉపయోగ పడేవి. ఈ చిక్కులను తొలగించి మొత్తం వ్యవహారాన్ని ఒక చోటికి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి ఇంటిని ఆ ఇల్లు ఉండే అక్షాంశం, రేఖాంశం ఆధారంగా జియో ట్యాగింగ్‌ చేస్తోంది. ఈ పద్ధతి ద్వారా ఎవరెక్కడ ఉన్నారనే విషయం సెకన్లలో తెలిసిపోతుంది. ఒక వ్యక్తి, ఆ కుటుంబ సభ్యులు, వారు నివసించే ఇల్లు, ఆ ఇల్లు పూరిల్లా, రేకుల ఇల్లా, పక్కా ఇల్లా.. వంటి వివరాలు, వీధి సమాచారం సహా మొత్తం అధికారుల లాగిన్లో కనిపిస్తాయి. మ్యాపులో వారున్న ప్రదేశం కనిపిస్తుంది. తద్వారా వారికి అత్యవసర సహాయాన్ని అందించవచ్చు. వారిని సంరక్షించడానికి తగిన సలహాలు, సూచనలు చేయవచ్చు.

సమస్యల సత్వర పరిష్కారం

జియో ట్యాగింగ్‌ ద్వారా సమస్యలను సత్వరం పరిష్కరించవచ్చు. ఒక గ్రామంలో తలెత్తిన సమస్య గురించి ఒకరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే, ఆ సమస్య పరిష్కరించాలంటే ఆ వ్యక్తి ఫోన్‌ నెంబరు, నివసించే ప్రాంతం ఇతర వివరాలన్నీ అధికారులు నమోదు చేసుకుంటేగానీ ఆ ప్రాంతానికి వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేయలేరు. దీనికోసం ఎంతో సమయం వృధా అవుతోంది. ఫిర్యాదులో ఇచ్చే మొబైల్‌/ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా ఒక్క సెకనులో ఫిర్యాదుదారు అడ్రస్‌ను కనుగొనేందుకు ఈ పద్ధతిలో వీలు కలుగుతుంది. ఆధార్‌ నెంబర్‌ ఒకసారి నమోదు చేస్తే చాలు.. మొత్తం వివరాలు అధికారుల ముందుకు వచ్చేస్తాయి. ఆ వ్యక్తి ఉండే ప్రాంతాన్ని నేరుగా మ్యాపులోనే చూడవచ్చు. తద్వారా నేరుగా ఆ ప్రాంతానికి చెందిన అధికారులకు ఆ బాధ్యత అప్పగించి సత్వరమే సమస్యలు పరిష్కరించవచ్చు.

ఫ జియో ట్యాగింగ్‌ ఇలా..

రాష్ట్రంలోని ప్రతి కుటుంబ వివరాలను ప్రభుత్వం జియో ట్యాగింగ్‌లో నమోదు చేస్తోంది. జీఎస్‌డబ్ల్యూఎస్‌ ఎంప్లాయిస్‌ మొబైల్‌ యాప్‌ అనే యాప్‌లో జియో ట్యాగింగ్‌ చేస్తారు. ఆ యాప్‌లో ప్రతి ఇంటి ఫొటో, డోర్‌ నెంబరు, లొకేషన్‌ను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అప్లోడ్‌ చేస్తారు. ప్రతి కుటుంబం వద్దకు సచివాలయ ఉద్యోగులు వెళ్లి ఆ కుంబానికి చెందిన ఇంటిని అప్లోడ్‌ చేసి వాటిని ధ్రువీకరించేలా కుటుంబ సభ్యుల్లో ఒకరితో ప్రత్యేక డివైజ్‌ ద్వారా వేలి ముద్రలు, ఫేస్‌, ఐరిష్‌ పద్ధతిలో ఆమోదం తీసుకుంటారు.

ఫ ఒక్కో ఉద్యోగికి 160 ఇళ్ల బాధ్యత

ప్రభుత్వం చేపట్టిన హౌస్‌హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ బాధ్యతను సచివాయల ఉద్యోగులకు అప్పగించింది. ఒక్కో ఉద్యోగి రెండు క్లస్టర్లలో హౌస్‌హోల్డ్‌ జియో ట్యాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఉద్యోగి 100 నుంచి గరిష్ఠంగా 160 ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. గత మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవగా గుంటూరుజిల్లాలో 7,32,187 ఇళ్లకుగానూ 1,20,151 ఇళ్లకు జియో ట్యాగింగ్‌ పూర్తయింది. ఇంకా 6,12,036 ఇళ్లకు జియో ట్యాగింగ్‌ చేయాల్సి వుంది. పల్నాడు జిల్లాలో 7,04,609 ఇళ్లకుగానూ 2,00,478 ఇళ్లకు జియో ట్యాగింగ్‌ పూర్తవగా, 5,04,131 ఇళ్లకు ట్యాగింగ్‌ చేయాల్సి వుంది. బాపట్ల జిల్లాలో 5,52,503 ఇళ్లకుగానూ 2,19,895 ఇళ్లకు జియో ట్యాగింగ్‌ పూర్తవగా, 3,32,608 ఇళ్లకు ట్యాగింగు చేయాల్సి వుంది.

ఫ బ్యాంకు లింకేజీపై స్పెషల్‌ డ్రైవ్‌

నేషనల్‌ పెన్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌పీసీఎల్‌) కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలు ఆధార్‌, మొబైల్‌ నెంబర్లతో అనుసంధానం అయ్యాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తోంది. బ్యాంకుకు ఆధార్‌, మొబైల్‌ నెంబర్‌ అనుసంధానం కానివారి వివరాలను ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల లాగిన్లకు పంపించారు. ఇలా బ్యాంకు లింకేజీ చేయని వారి వివరాలు తెలుసుకుని, వారికి విషయాన్ని తెలియజేసి ఆధార్‌ లింక్‌ చేసుకోవాలని ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుడికి అందించేలా డీబీటీ పద్ధతికి ప్రభుత్వం ప్రాధాన్యాన్ని పెంచింది.

Updated Date - Nov 14 , 2024 | 01:20 AM