Gidugu Rudraraju: షర్మిల కాంగ్రెస్‌లో చేరితేనే వైఎస్ మరణంపై అనుమానాలు మొదలయ్యాయా?
ABN, Publish Date - Jan 09 , 2024 | 10:15 AM
రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారాన్ని వైసీపీ, ప్రభుత్వ సలహాదారులు చేయడాన్ని ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నామన్నారు.
విశాఖపట్నం: రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందనే ప్రచారాన్ని వైసీపీ, ప్రభుత్వ సలహాదారులు చేయడాన్ని ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరువుకు భంగం కలిగించే ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. లీగల్ నోటీసులు పంపిస్తున్నామన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితేనే రాజశేఖర్ రెడ్డి మరణం మీద ఈ ప్రభుత్వానికి అనుమానాలు మొదలయ్యాయా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం వేరే ఆరోపణలు, ప్రచారాలు చేసుకోండి కానీ మహానాయకుడి మరణంతో ముడిపెట్ట వద్దని హెచ్చరిస్తున్నామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
‘‘త్యాగి కమిటీ విచారణ చేసి 139పేజీలు నివేదిక ఇచ్చింది. ఎంక్వైరీలో ప్రమాదం వల్లే రాజశేఖర్ రెడ్డి మరణం జరిగిందని తేలింది. ఎన్నికల్లో కాంగ్రెస్, సోనియా గాంధీని ఇబ్బంది పెట్టే చర్యలు ప్రతీ సారీ జరుగుతున్నాయి. వివేకానంద రెడ్డి మరణంపై సీబీఐ ఎంక్వైరీ కోరిన ముఖ్యమంత్రి.. గత ఐదేళ్లలో ఎందుకు విచారణ అడగలేదు? వైసీపీ నాయకులు, సలహాదారులు మాటలు వింటుంటే వైఎస్సార్ మరణం వెనుక వేరే కుట్ర ఏదైనా ఉందేమోననే అనుమానం కలుగుతోంది. తన తండ్రి మరణం వెనుక రిలయన్స్ ఉందని చెప్పిన జగన్.. ఆ సంస్థకు రెడ్ కార్పెట్ వేసి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం మీ చిత్తశుద్ధిని బయట పెడుతోంది’’ అని రుద్రరాజు పేర్కొన్నారు.
Updated Date - Jan 09 , 2024 | 10:15 AM