ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాశీ వెళ్లే తెలుగు భక్తులకి శుభవార్త..

ABN, Publish Date - Mar 06 , 2024 | 01:23 PM

కాశీ వెళ్లే భక్తులకు శుభవార్త. శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం ఆధ్వర్యంలో మరో వసతి గృహం ప్రారంభించారు. కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు. కాశీకి వెళ్లే తెలుగు వారికి ఇది నిజంగా శుభవార్తే. కాశీలో తెలుగు భక్తుల కోసం మరో వసతి గృహం అందుబాటులోకి వచ్చింది.

వారణాసి: కాశీ వెళ్లే భక్తులకు శుభవార్త. శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం ఆధ్వర్యంలో మరో వసతి గృహం ప్రారంభించారు. కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు. కాశీకి వెళ్లే తెలుగు వారికి ఇది నిజంగా శుభవార్తే. కాశీలో తెలుగు భక్తుల కోసం మరో వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. గత కొన్ని దశాబ్ధాల కాలంగా కాశీకి వెళ్లే తెలుగు వారికి ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లను శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం అందజేస్తోంది. శ్రీరామభద్రేంద్ర సరస్వతి స్థాపించిన శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం ఇప్పుడు మరింత విస్తరించారు. అత్యాధునిక వసతులతో, కొత్త హంగులతో నూతన వసతి గృహాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు.

శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందర శాస్త్రి ఆధర్వంలో ఏర్పాటైన నూతన వసతి గృహం శివరాత్రి రోజు నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. నూతన వసతి గృహ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దేశ్వరానంద భారతీ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమంతో తమకు ఎన్నో ఏళ్లుగా మధురమైన అనుబంధం ఉందని తెలిపారు. మేనేజింగ్ ట్రస్టీ సుందర శాస్త్రి తండ్రి వేమూరి శ్రీ రామ చంద్ర మూర్తి సేవలను గుర్తు చేసుకున్నారు. వేమూరి వేంకట సుందర శాస్త్రి ఈ ఆశ్రమ అభివృద్ధికి ఎంత గానో కృషి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గతంలో తను చాతుర్మాస్య వ్రతం దీక్ష ఈ ఆశ్రమంలో ఉండి కొనసాగించినట్లు కూడా సిద్దేశ్వరానంద భారతి స్వామి తెలిపారు. ఆంధ్ర ఆశ్రమం వారు అందిస్తున్న వసతి సౌకర్యాలు ,సేవలు అనేక మంది భక్తులు సద్వినియోగం చేసుకుంటూ శ్రీకాశీ విశాలాక్షి అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకునే అదృష్టాన్ని పొందుతున్నారని అన్నారు.

ఆశ్రమ అభివృద్ధి కి భక్తులు తమకు చేతనైనంతగా ఉడతాభక్తిగా సహాయసహకారాలు అందించాలని తమవంతు సేవలు అందించాలని సిద్దేశ్వరానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. ఈ ఆశ్రమానికి వచ్చిన వారందరికీ తమ సొంత ఇంటికి వచ్చామనే భావనతో ఆనందంగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాశీ అన్నపూర్ణా మాత ఆలయం ప్రధాన అర్చకులు శ్రీ శ్రీ.శ్రీ.శ్రీ మహంత శంకర పూరి మాట్లాడుతూ శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం సనాతన వైదిక ధర్మం పరిరక్షణ, సంస్కృతి సంప్రదాయాలు కాపాడే ప్రయత్నంగా ఈ ఆశ్రమం కృషి చేస్తున్నదని, అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు ఎంతగానో సేవలు అందిస్తూ, ప్రశంసలు అందుకుంటోందని తెలిపారు. ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందర శాస్త్రి మాట్లాడుతూ.. పెద్ద వారి ఆశీర్వాదం బలం, దైవానుగ్రహంతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

యాత్రీకులు సౌకర్యార్థం కాలానుగుణంగా అన్ని వసతులు కూడిన సరికొత్త భవననిర్మాణం కైలాస భవనం ఆవరణలోనే కొత్తగా బ్లాక్ -ఎ గదులు ఏర్పాటు చేయటం, వాటిని స్వామి వారు ప్రారంభించటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అదనంగా సుమారు వంద మంది కి పైగా యాత్రీకులు ఉండటానికి గదులు ఉన్నాయని, శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారి దయతో స్వామి వారి అనుగ్రహంతో.. మరింత కొత్త నిర్మాణాలను చేయాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. శివరాత్రి పర్వదినం నుంచి కైలాస భవన్ బ్లాక్ -ఎ గదులు భక్తులకు అందుబాటులో ఉంటాయని వేంకట సుందర శాస్త్రి తెలిపారు.

Updated Date - Mar 06 , 2024 | 03:27 PM

Advertising
Advertising