ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : సత్యనారాయణకు షాక్‌!

ABN, Publish Date - Jun 18 , 2024 | 06:14 AM

రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణను విధుల నుంచి రిలీవ్‌ చేసేందుకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఆయనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నిగ్గు తేలేవరకు ఆయనను రాష్ట్రంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది.

  • రైల్వేశాఖ అనుమతితో

  • రిలీవ్‌ను ఆపేసిన ప్రభుత్వం

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక శాఖ సెక్రటరీ సత్యనారాయణను విధుల నుంచి రిలీవ్‌ చేసేందుకు ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఆయనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నిగ్గు తేలేవరకు ఆయనను రాష్ట్రంలోనే ఉంచాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్‌ గడువును మరో 6మాసాలకు పెంచాలంటూ.. సత్యనారాయణ మాతృసంస్థ రైల్వేకు లేఖ రాసి.. అనుమతి తెచ్చుకుంది. దీంతో సత్యనారాయణ రిలీవింగ్‌ నిలిచిపోయింది. ఐఆర్‌ఏఎస్‌ అధికారి కేవీవీ సత్యనారాయణ 2017లో డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చి ఆర్థిక శాఖలో సెక్రటరీగా పాతుకుపోయారు.

జగన్‌ పాలనలో చెల్లింపుల వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని అనేక అవకతవకలకు పాల్పడ్డారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చి ఆర్థిక రంగాన్ని అస్తవ్యస్తం చేశారు. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు దొంగతనాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తన డిప్యూటేషన్‌ ఈనెల 18తో ముగిసిపోతోందంటూ మాతృసంస్థ ఇండియన్‌ రైల్వే్‌సకి లేఖ రాశారు. దీంతో ఆ శాఖ నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వే్‌సలో సత్యనారాయణకు పోస్టింగ్‌ ఇచ్చింది. కానీ, అక్కడ జాయిన్‌ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రిలీవింగ్‌ లేఖ ఇవ్వాలి. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణ సంగతి తేల్చాలని సర్కారు నిర్ణయించింది. ఆయనకు రిలీవింగ్‌ లేఖ ఇవ్వబోమని స్పష్టంచేస్తూ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ఆదేశాలిచ్చారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖతో సంప్రదింపులు జరిపి, మరో 6 నెలలపాటు సత్యనారాయణ రాష్ట్రంలోనే ఉండేలా అనుమతి తీసుకుంది. దీంతో సత్యనారాయణ చేసిన అవకతవకలపై ప్రభుత్వం విచారించేందుకు అవకాశం ఏర్పడింది.

Updated Date - Jun 18 , 2024 | 06:14 AM

Advertising
Advertising