గౌడ శ్మశాన వాటిక ధ్వంసం
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:51 PM
నందికొట్కూరు పట్టణంలో గౌడ శ్మశాన వాటిక ప్రహరీ(గోడ), ముఖద్వారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడం బాధాకరమని జై గౌడ సేవ ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జువ్వాజీ చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు.
నందికొట్కూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు పట్టణంలో గౌడ శ్మశాన వాటిక ప్రహరీ(గోడ), ముఖద్వారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి వేయడం బాధాకరమని జై గౌడ సేవ ఆంధ్రప్రదేశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జువ్వాజీ చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. సోమవారం నందికొట్కూరు పట్టణంలోని శాంతి థియేటర్ వెనుకభాగంలో సర్వే నెంబర్ 487-ఎ లోని 1.80 ఎకరాల్లో గౌడ శ్మశాన వాటికను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి గౌడ కులస్తులు ఈ శ్మశాన వాటికనే వాడుతున్నారన్నారు. కానీ కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేందుకు ఏకంగా శ్మశాన వాటికలను కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శ్మశాన వాటిక ప్రహరీని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జై గౌడ సేవ నంద్యాల జిల్లా అధ్యక్షులు పిట్ట ఎల్లగౌడ్, కర్నూలు జిల్లా అధ్యక్షులు సూర్య నారాయణ గౌడ్, సిద్దు గౌడ్, శ్రీనివాసులు గౌడ్, స్మశాన వాటిక వద్ద సంఘటన స్థలాన్ని పరిశీలించి నందికొట్కూరు పట్టణ సి.ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Updated Date - Nov 11 , 2024 | 11:51 PM