ఫిబ్రవరి నుంచి జీతాల్లేవు సార్!
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:31 AM
పంచాయతీరాజ్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి తమకు జీతాలు రావడం లేదని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించాలని వారు విన్నవిస్తున్నారు. వారి కథనం మేరకు.. ప్రతి పంచాయతీకీ ఒక కార్యదర్శిని నియమించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో
పంచాయతీరాజ్ అధికారుల నిర్లక్ష్యంవల్లే..
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించాలి
గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీల విన్నపం
అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి తమకు జీతాలు రావడం లేదని గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించాలని వారు విన్నవిస్తున్నారు. వారి కథనం మేరకు.. ప్రతి పంచాయతీకీ ఒక కార్యదర్శిని నియమించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీరాజ్‌శాఖ జీఓ 11ను విడుదల చేసింది. దీంతో సచివాలయంలో పనిచేస్తున్న 4 వేల మంది గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాలయాల నుంచి రిలీవ్ చేసి గ్రామ పంచాయతీల్లో నియమించారు. పంచాయతీరాజ్‌శాఖ జీఓ ఇచ్చి చేతులు దులుపుకుని కేడర్ స్ట్రెంత్‌ను మాత్రం అప్‌డేట్ చేయలేదు. దీంతో ట్రెజరీ అధికారులు ఆర్నెల్లుగా గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులకు జీతాలు విడుదల చేయలేదు. పంచాయతీరాజ్ కమిషనరేట్ అధికారులు డేటా ఇస్తే ప్రాసెస్ చేస్తామని ట్రెజరీ అధికారులు చెప్తున్నారు. కమిషనరేట్ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడంతో పంచాయతీ కార్యదర్శులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. 4348 మందికి గ్రామ పంచాయతీలు ఇవ్వొచ్చు అని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ... ఆ సంఖ్యను కేడర్ స్ట్రెంత్‌గా సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌డేట్ చేయకపోవడంతో అటు జీతాలు రాక, ఇటు పంచాయతీల్లో బిల్లులు పెట్టలేక గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ కూడా అటకెక్కిందని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. సచివాలయాల నుంచి పంచాయతీరాజ్ ఎంపీడీఓల లాగిన్‌లోకి వారిని మారుస్తూ పంచాయతీరాజ్‌శాఖ, ట్రెజరీలకు అనుమతి ఇస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్తున్నారు. జీతాల్లేక తాము ఇబ్బందులు పడుతున్నా... పంచాయతీరాజ్ అధికారులు మాత్రం పట్టించుకోలేదని, దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ స్పందించి తమ సమస్య సత్వరమే పరిష్కారమయ్యేలా ఆదేశాలివ్వాలని వారు కోరు తున్నారు.
Updated Date - Jul 11 , 2024 | 04:31 AM