ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Sep 02 , 2024 | 11:38 PM

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను కూటమి నాయకు లు ఘనంగా నిర్వహిం చారు.

మదనపల్లెలో అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహానబాషా పీలేరులో రక్తదానం చేస్తున్న దృశ్యం

మదనపల్లె టౌన, సెప్టెంబరు 2: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను కూటమి నాయకు లు ఘనంగా నిర్వహిం చారు. సోమవారం స్థానిక బెంగళూరు బస్టాం డు వద్ద జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత ఆధ్వర్యంలో పవన కళ్యాణ్‌ జన్మదిన కేక్‌ను ఎమ్మెల్యే షాజహానబాషా కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన డం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ కలయికతో ఐదున్నర కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో దారం హరి, నాదెళ్ల విద్యాసాగర్‌, ఆంజనేయకుమార్‌, షంషీర్‌, బాబా ఫకృద్దీన, జనసేన నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఇండసి్ట్రయల్‌ ఎస్టేట్‌ వద్ద పవనకళ్యాణ్‌ అభిమానులు జయ భవ్య, కిశోర్‌ దంపతుల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించి 300మంది పేదలకు అన్నదానం చేశారు. సీటీఎం క్రాస్‌రోడ్డులో దిలీఫ్‌కుమార్‌, టీడీపీ నాయకులు రెడ్డిరాంప్రసాద్‌, చల్లా నరసింహులు పాల్గొన్నారు.

మదనపల్లె అర్బనలో: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకులు మదనపల్లె జనసేన పార్టీ సీనియర్‌ నేత శ్రీరామరామాంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం వరా ల ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు జనసేన నాయకుడు శ్రీరామ హరిహరన పాలు, పండ్లు, బ్రెడ్‌లను పంపిణీ చేశారు. జనసైనికులతో రక్తదాన శిబిరం నిర్వహించి అనంతరం 200మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సీటీఎం, కొత్తవారిపల్లెలో కేక్‌కట్‌ చేసి, అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ యువనాయకుడు శ్రీరామ హరిహరన, పట్టణ అధ్యక్షుడు జగదీష్‌బాబు, నాయకులు విజ యేంద్ర రాయల్‌, నవాజ్‌, సోను, హర్ష, నవీన, అవినాష్‌, శేఖర్‌, సత్య, బహుదూర్‌, పెద్ద ఎత్తున జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు. ,

పీలేరులో: జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం పీలేరులోని జనసైనికులు అట్టహాసంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా స్థానిక మదనపల్లె టర్నింగ్‌లో జనసేన జెండా ఆవిష్కరించడమే కాకుండా అక్కడి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో పేదలకు అన్నదానం చేశారు. అనంతరం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి నేతృ త్వంలో జరిగిన కార్యక్రమంలో పీలేరు ఇనఛార్జ్‌ బెజవాడ దినేశ, పీలే రు మండల అధ్యక్షుడు మోహనకృష్ణ, జనసైనికులు గజేంద్రా, మున్నా, రాజేశ, నవీన, పవన, గౌస్‌, గాయత్రి, గురుమోహన, నరేశ, విజ య్‌, వెంకటరమణ, హరీశ, ధనంజయ, డాక్టర్‌ మురళీకృష్ణ, పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో : ఆంధ్రప్రదేశ ఉప ముఖ్యమంత్రి కొణెదల పవన కళ్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలను పీటీఎంలో కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్‌ పోతుల సాయినాథ్‌ హాజరయ్యారు. సోమవా రం స్థానిక బస్టాండు కూడలిలో మండల జనసేన, టీడీపీ, బీజేపీలకు చెందిన కూటమి నాయకులు పవన కళ్యాణ్‌ పుట్టిన రోజును పురష్క రించుకుని కేక్‌ను కట్‌ చేసి సంబరాలను చేసుకున్నారు. కార్యక్రమం లో జనసేన పార్టీ మండల అద్యక్షుడు శంకర్‌, మాజీ ఎంపీటీసీ సూరి, టీడీపీ నాయకులు కుమ్మరవారిపల్లె రాజేష్‌, మాజీ ఎంపీటీసీ చంద్రశే ఖర్‌ (చిన్నా), భజంత్రి రామచంద్ర, పాల గంగాద్రి, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలోని పెద్దమండ్యం, సిద్దవ రం, తురకపల్లి తదితర గ్రామాలలో సోమవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ పుట్టిరోజు వేడులకల సందర్భంగా కేక్‌లు కట్‌ చేసి పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్‌ ఆధ్వర్యంలో పెద్దమండ్యంలోని బేతస్థ ఆనాఽథాశ్ర మంలో అన్నదానం నిర్వహించారు. బండమీదపల్లి గ్రామ పరిధిలోని తురకపల్లిలో ఇస్మాయిల్‌ ఆధ్వర్యంలో కూటమినేతలు డిప్యూటీ సీఎం పవనకల్యాన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి నేతలు సిద్దవరం ప్రసాద్‌, బాబురెడ్డి, రుక్మాంగధరెడ్డి, ఆర్‌కే రామకృష్ణ, ప్రభాకరరెడ్డి, భీమయ్య, సయ్యద్‌షావలి, నాగరాజు, ఫయా జ్‌, బావాజీ, రవీంద్ర, ఇస్మాయిల్‌(చింటు), వీరమహిళలు పాల్గొన్నారు.

గుర్రంకొండలో:జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బస్టాండులో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు దినేష్‌, జగదీష్‌, మురళీ, బాలాజి తదితరులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవనకళ్యాణ్‌ 53వ జన్మదిన వేడుకలను తంబళ్లపల్లెలో కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్‌ మహేష్‌ ఆధ్వర్యంలో పట్టణంలో ద్విచక్రవాహ ర్యాలీ నిర్వహించి తంబళ్లపల్లె సిద్దారెడ్డిగారిపల్లెలో నూతనంగా జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం హరిత కూడలి వద్ద పవన కళ్యాణ్‌ చిత్రపటానికి క్షీరాభిషే కం చేసి కేక్‌ కట్‌ చేసి ప్రజలకు పంచిపెట్టారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, సురేష్‌, రఘు, టీడీపీ నాయకులు సిద్దమ్మ, గ్రామ ప్రధాన కార్యదర్శి శివకు మా ర్‌, వీరాంజినేయులు, దివ్యాంగ అధ్యక్షుడు రామాంజులు, మహిళా స మాఖ్య అధ్యక్షురాలు రామలక్ష్మీ, గులాం, జగదీష్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

నిమ్మనపల్లిలో: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను మదనపల్లి జనసేన నేత తోటకళ్యాణ్‌, మండల అధ్యక్షుడు ప్రధీప్‌, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా స్థాఽనిక ఎమ్మెల్యే షాజహనబాషాతో పాటు జనసేన కార్యకర్తలు మదనపల్లి నుంచి బైకుర్యాలీగా నిమ్మనపల్లి వచ్చి కేకు కట్‌చేసి అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో పాల్గొని రక్తదానం చేసే జనసేన కార్యక్తలను అభినందించారు. అనంతరం ముష్టూరులోని కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న 200మంది విధ్యార్థినులకు మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ తన సొంత నిధు లతో బకెట్లు, జగ్గులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను బి.కొత్తకోటలో ఆ పార్టీ నాయకులు, అభి మానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక జనసేన నాయకుడు చింత ల కిరణ్‌రాయల్‌ ఆధ్వర్యంలో జ్యోతిసర్కిల్‌ లో భారీకేక్‌ కట్‌చేసి పం చిపెట్టారు. కొండాసెంటర్‌ వద్ద మెగారక్తదానశిబిరం ఏర్పాటు చేసి 130కి పైగా జనసైనికులు రక్తదానం చేశారు. జెండాలను చేతపట్టి పట్టణంలో పెద్దఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. నగరపంచాయతీ పరిధిలో కమిషనర్‌ మనోహర్‌తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్ర మంలో జనసైనికులు రామాంజనేయులు, ప్రసాద్‌, మనోహర్‌ రాయల్‌, శేఖర్‌, చందు, గౌతం, రాజేంద్రప్రసాద్‌, మహేంద్ర,నాగేంద్ర, శ్రీనివా సులు, చైతన్య, ప్రశాంత, కేశవ, సుధాకర్‌, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

కురబలకోటలో: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా నిర్వ హించారు. సోమవారం మండలంలోని అంగళ్ళు ఎనటీఆర్‌ సర్కిల్‌లో కేక్‌కట్‌ చేసి స్వీట్లు, పండ్లు పంచి పెట్టారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌, అయూబ్‌బాషా, మనోజ్‌, అంజి, మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు, సూరి, రాజంపేట తెలుగు యువత కార్యదర్శి అయూబ్‌ బాషా, భాస్కర్‌, ఇమ్రాన పాల్గొన్నారు.

ములకలచెరువులో: ములకలచెరువులో సోమవారం డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇనచార్జి పోతుల సాయినాఽథ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదానం కార్యక్రమాలు జరిగాయి. అలాగే జనసేన ఇనచార్జితో కలిసి టీఎనఎస్వీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు కట్టా దొరస్వామినాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధాలు భారీ కేక్‌ను కట్‌ చేసి అన్నదానం చేశారు. రక్తదాన శబిరంలో 106 మంది రక్తదానం చేశారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి వెంక టస్వామి. నేతలు కేవీ రమణ, శివన్న, జనసేన నాయకులు షోరూం సూరి, జేసీబీ శీన, రాజు, సుబ్రమణ్యం, అనీల్‌ పాల్గొన్నారు.

కలికిరిలో: డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌ జన్మదిన వేడుకలను జనసేన శ్రేణులు, పవన అభిమానులు కలికిరిలో సోమవారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పం డ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఆసుపత్రిలోనే పవన అభిమానులు రక్త దానం చేశారు. కార్యక్రమాలను నియోజక వర్గ ఇనచార్జీ బెజవాడ దినేష్‌, మండల ఇనచార్జీ అస్లామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

వాల్మీకిపురంలో: రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవనకళ్యాణ్‌ జన్మదిన వేడుకలను సోమవారం వాల్మీకిపురంలో ఘనం గా జరుపుకున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ బస్టాండ్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. అలాగే జనసేన జెండా ఆవిష్కరించి పేదలకు పండ్లు, పాలు, రొట్టెల పంపిణీ చేశారు. ఈకార్యక్రమాలలో పీలేరు జనసేన ఇనఛార్జి బెజవాడ దినేష్‌, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, జనసైనికులు, పవనకళ్యాణ్‌ అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

రామసముద్రంలో: ఉపముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌ జన్మదిన వేడు కలు సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈసంద ర్భంగా జనసేన నాయకులు, పవన అభిమానులు పలు సేవా కార్యక్ర మాలు నిర్వహించారు. చెంబకూరు పంచాయతీలో జనసేన రాయలసీ మ కోకన్వీనర్‌ రాందాస్‌చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కు పాలు, పండ్లు పంచిపెట్టి అనంతరం మొక్కలు నాటారు. మండల కేంద్రంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో పవనకళ్యాణ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, అన్నదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల, రూరల్‌ ప్రెసిడెంట్‌ గ్రానైట్‌ బాబు, జిల్లా జాయింట్‌ సెక్రటరీలు సనావుల్లా, సికిందర్‌, పూల ఆంజప్ప, ప్రభాకర్‌, జనార్దన, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 11:38 PM

Advertising
Advertising