ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN, Publish Date - Apr 21 , 2024 | 12:48 AM
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు కేకులు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నాయి. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు స్వగృహంలో కేక్ కట్ చేసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథికి తినిపించారు. అలాగే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వెంకటాపురం కాలనీలో కేక్‌కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డి కేక్‌కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆలూరు టీడీపీ కార్యాలయంలో
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కపట్రాళ్ల బుజ్జమ్మ, యువనేత గిరి మల్లేష్ గౌడ్ కేక్ కట్ చేశారు. అలాగే మద్దికెర మండల టీడీపీ ఇన్‌చార్జి దివాకర్ గౌడు, జిల్లా కార్యదర్శి గూడూరు ధనుంజయుడు, మండల అధ్యక్షుడు గురుప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ దేవత మద్దమ్మకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేశారు.
- ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క
Updated Date - Apr 21 , 2024 | 12:48 AM