ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చిన్నారుల్లో ప్రతిభను ప్రోత్సహించాలి: బుద్ధప్రసాద్‌

ABN, Publish Date - Nov 16 , 2024 | 03:59 AM

ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీ బాలోత్సవ్‌-2024 గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది.

ఘనంగా వీవీఐటీ బాలోత్సవ్‌ ప్రారంభం

పెదకాకాని, నవంబరు 15(ఆంధ్రజ్యోతి ): ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీ బాలోత్సవ్‌-2024 గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమైంది. 13 వేల మందికి పైగా పోటీదారులు పాల్గొనే ఈ వేడుకలు... 20 అంశా లు 61 విభాగాల్లో 3 రోజులపాటు 30 వేదికలపై జరగనున్నాయి. వేడుకలను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మకత నైపుణ్యాలను వెలికితీసే ప్రయత్నం వీవీఐటీ బాలోత్సవం అని కొనియాడారు. చిన్నారులకు కళలపట్ల సరియైున ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకుపోవాలన్నారు. తెలుగుజాతికి ప్రత్యేక కళాసాంప్రదాయాలు ఉన్నాయని వాటిని మనం ప్రోత్సహించాలన్నారు. భాషను గౌరవించుకోవాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలని చిన్నారులకు సూచించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలని అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అప్పుడే పరిపూర్ణమైన విద్యార్థిగా ఎదుగుతారని అన్నారు. వీవీఐటీ చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌ మాట్లాడుతూ చిన్నారులు ఆనందంగా ఉంటే అందరం ఆనందంగా ఉంటామని అన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 03:59 AM