Guntur: భూమితో బంధం తెగుతోంది
ABN, Publish Date - Nov 08 , 2024 | 09:17 AM
ఇప్పటికీ ప్రపంచంలో ఏ కొత్త వరి వంగడం వచ్చినా ఆయన దగ్గరకు పరిశీలనకు వస్తుంది. 90 పదుల వయసులో కూడా ఆయన 25 ఎకరాల్లో వరి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 16 నేషనల్ అవార్డు లు, 3 ఇంటర్నేషనల్ అవార్డులు పొందిన ఆయన ఇప్పటికీ రోజుకు 16 గంటలు వ్యవసాయం గురించే మాట్లాడతారు.
- 70 శాతం మంది సాగుకు దూరమయ్యారు
- యుద్దానికి వెళ్లే సైనికుడిలా రైతు వెన్నుతట్టే వాళ్లు కావాలి
- ఐదు వేల ఎకరాలకు ఒక సైంటిస్ట్ కావాలి
- పెట్టుబడి.. దిగుబడి మధ్య ఉన్న అంతరం తగ్గించాలి
- వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలి
- ప్రముఖ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు
గుంటూరు సిటీ: ఇప్పటికీ ప్రపంచంలో ఏ కొత్త వరి వంగడం వచ్చినా ఆయన దగ్గరకు పరిశీలనకు వస్తుంది. 90 పదుల వయసులో కూడా ఆయన 25 ఎకరాల్లో వరి సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. 16 నేషనల్ అవార్డు లు, 3 ఇంటర్నేషనల్ అవార్డులు పొందిన ఆయన ఇప్పటికీ రోజుకు 16 గంటలు వ్యవసాయం గురించే మాట్లాడతారు. అంత పెద్ద వయ స్సులో నడిచొస్తున్న వ్యవసాయ యూని వర్సిటీలా అనిపించే నెక్కంటి సుబ్బారావు ను ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం ఎన్‌జీరంగా 124వ జయంతిని పురస్కరించుకుని ఆయనను ఘనంగా సన్మానించి, పురస్కారం అందజేసింది. ఈ సందర్భంగా ప్రముఖ రైతు శాస్త్రవేత్త నెక్కంటి సుబ్బారావు ఇప్పటి సాగు పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ తో మాట్లాడారు.
ప్రస్తుత సాగు పరిస్థితి ఎలా ఉంది ?
సుబ్బారావు: ఇప్పుడు సాగు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. నూటికి 70 శాతం మంది పొలాలు కౌలుకు ఇచ్చి విదే శాలకు, ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోతున్నారు. ఎక్కువ భూమి కౌలు రైతుల చేతిలోనే ఉంది. భూమికీ యజమానితో ఉన్న బం ధం తెగిపోతోంది. దాన్ని పునరుద్థరించాలి. కారణం ఏదైనా కావచ్చు కానీ సాగు విస్తీర్ణం పడిపోతే రాష్ట్రం దుర్భిక్షం అవుతుంది. మిగిలిన అన్ని రంగాల్లో పురోగతి సాధించి ఇక్కడ ఫెయిల్ అయితే ఆ నష్టం ఏమి చేసినా పూడ్చలేము.
ఎక్కువ మంది సాగుకు దూరం కావటానికి కారణం?
నెక్కంటి : కారణాలు అనేకం. కొందరు పిల్లలు దగ్గరకు అని వెళ్లిపోతున్నారు. కొందరు సాగు గిట్టుబాటు కావడం లేదని దూరం అవుతున్నారు. పెట్టుబడికీ దిగుబడికీ మధ్య పెద్ద అంతరం ఏర్పడింది. నేను సాగులో అడుగుపెట్టినప్పుడు అసలు మాకు ఎరువుల సంగతి తెలియదు. గోదావరి నుంచి వచ్చే నీళ్లు ఎర్రగా ఒండ్రు మట్టి తో వచ్చేవి. ఫిలిప్పీన్స్ తయారు చేసిన ఐఆర్-8 వరి వంగడం మొదట కోయంబత్తూరు వెళ్ళింది. అక్కడ మిగిలిన నారు తెచ్చి నేను సాగు చేశాను. వాళ్ళు ఎరువులు, మందులు ఎక్కువగా కొట్టారు. దాంతో ఎకరాకు 25 బస్తాలు దిగుబడి వచ్చింది. నేను ఏమి వాడలేదు ఎకరాకు 40 బస్తాలు దిగుబడి వచ్చింది. అది చూేస దేశం అంతా నా చుట్టూ తిరిగింది. ఇప్పుడు ఎంత ఎక్కువ ఎరువులు, పురుగు మందులు వాడితే అంత మంచి రైతు అంటున్నారు. ఈ ధోరణి మారాలి. భూమి తల్లిని కాపాడాలి.అవసరం ఉన్నా లేకున్నా వాడుతున్న రసాయన ఎరువులు, మందుల వల్ల నేల నిస్సారం అవుతుంది. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు పెరగాలి.
సాగు శాతం పెంచాలంటే? సుబ్బారావు:
అది ప్రభుత్వం చేతుల్లో మాత్రమే ఉంది. అనేక రంగాలను ప్రోత్సహిం చటానికి ఏవిధంగా అయితే సబ్సిడీ లు ఇస్తు న్నారో ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. సాగుచేేస రైతులను ప్రోత్స హించాలి. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలి. ఆ మద్దతు ధర నిర్ణయం రైతుల సమక్షంలో జరగాలి.ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయించే మద్దతు ధర వల్ల రైతుకు కష్టానికి తగిన ఫలితం రాదు. ప్రస్తుతం 30 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి ఉ న్నారు. ఆయన ఎంత భూమిని పరీక్షించగలడు. ఎంత మందికి సరైన సమయంలో సల హాలు ఇవ్వగలడు. ఆ విధానం మారాలి. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక శాస్త్రవేత్త కావాలి. యుద్ధ్దా నికి వెళ్లే సైనికుడ్ని వెన్ను తట్టి పంపినట్లు రైతును అలా వెన్ను తట్టే వాళ్ళు కావాలి. రైతు చెయ్యి ఎప్పుడూ పైన ఉంటేనే రాష్ట్రం సుభిక్షం అవుతుంది. అందరూ సాఫ్ట్‌వేర్, హార్డ్ వేర్లు అయితే అన్నం ఎవరు పెడతారు. కాబట్టి మన ఆలోచన ధోరణిలో కొంత మార్పు రావాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు రైతులు అయినందుకు గర్వపడే రోజులు రావాలి.
ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో నెక్కంటి సుబ్బారావు నిలువెత్తు ఫోటో ఇప్పటికీ కనిపిస్తుంది. కరువు వచ్చి ప్రపంచం ఆకలితో చచ్చిపోతుంటే సాగులో శాస్త్రవేత్తలు చేయలేని అద్భుతాలు రైతుగా ఆయన చేసి పలువురుకి పట్టెడన్నం పెట్టినందుకు దక్కిన గౌరవ మది. 1967లో వచ్చిన హరిత విప్లవానికి ఆయనే నాంది అయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఐఆర్-8 వరి వంగడానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ఆకలితో లక్షలాది మంది చనిపోయిన పశ్చిమ బెంగాల్ సహా, యావత్ భారతావనికి కడుపు నింపారు. సుబ్బారావు సాగు స్ఫూర్తి కి మంత్ర ముగ్థులైన 50 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేశ, విదేశాల వ్యవసాయ సైంటిస్టులు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట వచ్చి వెళ్లారు.
ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్.. ఐటీ కారిడార్‌లో విక్రయం
ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!
Read Latest Telangana News and National News
Updated Date - Nov 08 , 2024 | 10:59 AM