Viral news: దక్షిణ కజకిస్థాన్‌లో బయటపడిన నిధి.. అందులో ఏం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ABN, Publish Date - Jun 07 , 2024 | 07:12 AM
దక్షిణ కజకిస్తాన్‌లోని టర్కిస్థాన్ ప్రాంతంలో ఓ నిధి బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆ నిధిని కనిపెట్టింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాదాపు 2000ఏళ్ల నాటిది కావడంతో స్థానికంగా తెగ చర్చ నడుస్తోంది.
దక్షిణ కజకిస్తాన్‌లోని టర్కిస్థాన్(Turkistan) ప్రాంతంలో ఓ బంగారు నిధి(Gold Treasure) బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆ నిధిని కనిపెట్టింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాదాపు 2000ఏళ్ల నాటిది కావడంతో స్థానికంగా తెగ చర్చ నడుస్తోంది.
దక్షిణ కజకిస్తాన్‌లోని టర్కిస్తాన్ ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు మూడు శవపేటికలను గుర్తించారు. అందులో రెండు అప్పటికే దొంగలు దోచుకున్నట్లు గుర్తించారు. మిగిలిన దాంట్లో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. వాటిని చూసి శాస్త్రవేత్తల బృందం అవాక్కైంది. ఎందుకంటే అందులో రోమన్ స్టైల్ బ్రూచ్, పెద్ద అలాగే చిన్న పూసలు, రెండు బంగారు చెవిపోగులు, కాంస్య అద్దం, మట్టి కూజా వంటి పలు పురాతన సామగ్రి ఉంది. అంత పురాతన కాలంలోనే ఇలాంటి వస్తువులు తయారు చేయడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా అర్ధ చంద్రాకారంలో ఉన్న చెవిపోగులు సూర్యరశ్మిని ప్రతిబింబించేలా తయారు చేశారు. ద్రాక్ష సమూహాలుగా పోలిన బంగారు బటన్లు చెవిపోగులకు మరింత అందాన్ని తెచ్చాయి. ఇవి క్రీస్తు పూర్వం క్రీ.పూ. ఐదో శతాబ్దం నుంచి క్రీ.శ. నాల్గవ శతాబ్దం మధ్య కాంగ్జు హయాంలో తయారు చేసినట్లు శాస్త్రవేత్తల బృందం చీఫ్ చెప్పుకొచ్చారు. కాంగ్జు పాలనలో వాణిజ్య ఒప్పందాలు పురాతన చైనా, కుషాన్ సామ్రాజ్యాల మధ్య సాగినట్లు ఆయన వెల్లడించారు. బంగారు ఆభరణాలను బట్టి చూస్తే శవపేటికలో పెట్టిన మహిళ ధనవంతురాలై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Updated Date - Jun 07 , 2024 | 07:13 AM