Suicide Attempt: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం..
ABN, Publish Date - Mar 13 , 2024 | 10:33 AM
గుంటూరు జిల్లా: తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగిన భర్త, భార్య, కుమార్తె. ఈ ఘటనలో భార్య నాగమణి మృతిచెందగా.. భర్త శివ శంకర్రావు , కుమార్తె హారిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గుంటూరు జిల్లా: తెనాలిలో ఓ కుటుంబం (Family) ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసింది. అప్పుల బాధ తాళలేక పురుగుల మందు (Pesticide) తాగిన భర్త, భార్య, కుమార్తె. ఈ ఘటనలో భార్య నాగమణి మృతిచెందగా.. భర్త శివ శంకర్రావు , కుమార్తె హారిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెనాలి (Tenali)లోని నాజర్‌పేటలో గత రాత్రి ఆ కుటుంబం పురుగుల మందు తాగింది. ఇది గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శివ శంకర్రావు రైల్వేస్టేషన్‌లో టీ స్టాల్ నడుపుతున్నాడు. గత కొద్ది రోజులుగా అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - Mar 13 , 2024 | 10:33 AM