ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా నగరవనం

ABN, Publish Date - Jun 24 , 2024 | 01:14 AM

అరుదైన పక్షులు, పక్షుల కిలకిల రాగాలు, చెట్ల పొదల్లో నుంచి వచ్చే పిల్లగాలులు, వన్యప్రాణుల అరుపులు ఇవన్నీ వింటుంటే పర్యాటక అందాల మధ్య ఒక్క రోజైనా గడపాలని కోరిక కలగక తప్పదు.

వినుకొండలో వెంకుపాలెం కురవ వద్ద నూతనంగా నిర్మించిన నగర వనం

- చుట్టూ కొండలు.. కనువిందు చేసే ప్రకృతి అందాలు...

- త్వరలో నామమాత్రపు రుసుంతో అందుబాటులోకి..

వినుకొండ జూన్‌ 24: అరుదైన పక్షులు, పక్షుల కిలకిల రాగాలు, చెట్ల పొదల్లో నుంచి వచ్చే పిల్లగాలులు, వన్యప్రాణుల అరుపులు ఇవన్నీ వింటుంటే పర్యాటక అందాల మధ్య ఒక్క రోజైనా గడపాలని కోరిక కలగక తప్పదు. కోరిక తీరాలంటే వినుకొండకు సుమారు 7 కిలో మీటర్లు దూరంలో కేంద్ర ప్రభుత్వం నగర యోజన పథకం కింద సుమారు 1.60 లక్షల రూపాయలతో వెంకుపాలెం కురవ వద్ద అటవీ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన నగరవనాన్ని సందర్శించాల్సిందే. సుమారు 50ఎకరాల విస్తీర్ణంలో అరుదైన మొక్కలు, వృక్షాల పెంపకాలతో రూపుదిద్దుకుంటున్న ఈవనం పచ్చటి అందాలు, నగరవనం చుట్టూ అటు వెంకుపాలెం, వినుకొండలను చూడగానే ప్రకృతి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు ఒక్కరోజు గడిపేందుకు వీలుగా పలు సౌకర్యాలు సమకూర్చారు. నగరవనం ముఖద్వారం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పర్యావణహితంగా నిర్మించిన తాటిబద్దలతో నిర్మించిన కట్టడాలు, ఆహ్లాదకర నిర్మాణాలపై పిచుకల అల్లికలను తలపించేలా రెల్లిగడ్డి అల్లికలు, ఎప్పుడూ ఎక్కడా చూడని నిర్మాణాలు ఆకట్టుకుంటున్నాయి. ఓపెన్‌ జిమ్‌, పచ్చటి అడవి ఔషధ మొక్కల మధ్య వీచే స్వచ్ఛమైన గాలిలో వాకింగ్‌ ట్రాక్‌, ఐరన్‌రహిత పిల్లల క్రీడా పరికరాలు, వయోవృద్ధులు సేదతీరేందుకు నిర్మించిన పర్ణశాలను తలపించే పాకలు, తాటి ఆకులతో నిర్మించిన యోగాశ్రమం, కొండపై నిర్మాణంలో ఉన్న ఏరియల్‌ వ్యూ. ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో నిర్మించిన నగరవనం వినుకొండ ప్రజలకు వరంగా మారనుంది. సాయంత్రం సంధ్యాకాలం సమయంలో చూట్టూ పెట్టని కోటలుగా వెలసిన కొండల అందాలు మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నింపుతుంది. వినుకొండ ఆర్‌టీసీ బస్టాండ్‌ నుంచి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నాయి. కొండపై నుంచి ప్రకృతి అందాలతో పాటు, వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాలను చూడవచ్చు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయగా ఇప్పటికి కార్యరూపం దాలుస్తోంది. అటవీ ప్రాంతం అధికంగా ఉన్న వినుకొండలో నగర వనం ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించిన ధాఖలాలు లేవు. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తిచేపసుకుని, రకరకాలపైన పూల మొక్కలు పెంపకానికి సన్నాహాలు చేస్తున్నారు.

నగర వనానికి వచ్చే యాత్రికులకు, ప్రకృతి ప్రేమికుల టికెట్‌ ద్వారా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, నామమాత్రంగా టికెట్‌ రేటు కేటాయించడం జరుగుతుందని, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నగర వనం సందర్శన అనంతరం మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పనులు పూర్తిచేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని పారెస్టు అధికారి హుసేన్‌ తెలిపారు.

Updated Date - Jun 24 , 2024 | 01:14 AM

Advertising
Advertising