ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: నిందితుడికి రాచ మర్యాదలపై విమర్శలు.. అసలు విషయం చెప్పిన ఎస్పీ

ABN, Publish Date - Nov 09 , 2024 | 08:24 PM

ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఎక్కువుగా ఉంటుంది. కానీ కొందరు తమ బాధ్యతలను మర్చిపోయి ఇష్టా రాజ్యంగా వ్యవహారిస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు అధికారంలో ఉన్న పార్టీకి చెంచాగిరి చేస్తూ.. నాయకుల కోసం నిబంధనలు..

ప్రభుత్వ ఉద్యోగులను ఎంతో గౌరవంగా చూస్తారు.. ఓ రకంగా చెప్పాలంటే ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఉద్యోగుల పట్ల మర్యాదగా వ్యవహారిస్తారు. ప్రజల డబ్బులతో జీతం తీసుకునే ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా వ్యవహారించాలి. ప్రభుత్వ ఉద్యోగికి బాధ్యత ఎక్కువుగా ఉంటుంది. కానీ కొందరు తమ బాధ్యతలను మర్చిపోయి ఇష్టా రాజ్యంగా వ్యవహారిస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు అధికారంలో ఉన్న పార్టీకి చెంచాగిరి చేస్తూ.. నాయకుల కోసం నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఘటనలు గత ఐదేళ్లలో ఎన్నో చూశాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా పోలీసు శాఖలో కొందరు ఉద్యోగులు ఎలా పనిచేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మాత్రమే కాదు.. విశ్వం మొత్తం చూసింది. అధికారుల పద్ధతి మారాలంటే వైసీపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారు. ప్రభుత్వం మారినా కొందరు అధికారుల తీరు మాత్రం మారడంలేదట. ఇంకా జగన్ సేవల్లోనే పలువురు అధికారులు తరిస్తున్నారనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాము చేస్తున్న పని నిబంధనలకు, సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకమని తెలిసినా కొందరు మాత్రం ఇంకా వైసీపీకి సేవ చేసుకునే పనిలోనే బిజీగా ఉన్నారట. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. బెదిరింపులతో పాటు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన రౌడీ షీటర్, వైసీపీ అభిమాని బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో రాచమర్యాదలు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. దీంతో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ క్లారిటీ ఇచ్చారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పోలీసు సిబ్బంది వ్యవహారించారని స్పష్టం చేశారు. రెస్టారెంట్‌లో భోజనం విషయంలో మాత్రం సిబ్బంది తప్పున్నట్లు ఎస్పీ తెలిపారు.


బోరుగడ్డకు రాచమర్యాదలంటూ వీడియో..

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌ను భోజనం కోసం రెస్టారెంట్‌కు తీసుకెళ్లి రాచమర్యాదలు చేశారన్న వార్త బయటకు రావడంతో సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్‌లో సీఐ స్థాయి అధికారితో పాటు కానిస్టేబుల్స్ బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు చేయడంతో పాటు.. బయటనుంచి ఆహారం తీసుకొచ్చి ఇవ్వడం, పడుకోవడానికి బల్లను, దుప్పట్లు అందజేసినట్లు కనిపిస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో ఓ రౌడీ షీటర్‌ను గౌరవించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో వైరల్ కావడంతో గుంటూరు ఎస్పీ స్పందించారు. బోరుగడ్డ అనిల్‌ను కస్టడీకి ఇచ్చే ముందు కోర్టు 14 షరతులు విధించిందని తెలిపారు. కోర్టు నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామని చెప్పారు. నీళ్లు, భోజనం, నిద్రపోయేందుకు వసతి కల్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసిందని ఎస్పీ చెప్పారు. అలాగే బోరుగడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చిన నివేదికలో ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసిందని, దీంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి వచ్చిందని, దీనిలో భాగంగానే ఆయనకు దిండు వంటివి అందించినట్లు చెప్పారు. ఈ వీడియోపై రాద్ధాంతం అవసరం లేదని, బోరుగడ్డకు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి రాచమర్యాదలు చేయలేదని ఎస్పీ క్లారిటీ ఇచ్చారు.


వీడియో బయటకు రావడంపై..

వీడియోలోని అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో బయటకు ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. స్టేషన్‌లో వీడియో బయటకు వచ్చే అవకాశం లేదని, ఇది పెద్ద తప్పిదంగా భావిస్తున్నామని ఎస్సీ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 09 , 2024 | 09:40 PM