నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు
ABN, Publish Date - Nov 17 , 2024 | 01:27 AM
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత డీఎస్సీ శిక్షణా శిబిరాన్ని శనివారం బావుడా చైర్మన్‌గా ఇటీవల నియమితులైన సలగల రాజశేఖరబాబుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు
ఉచిత డీఎస్సీ శిక్షణా శిబిరం ప్రారంభోత్సవంలో కలెక్టర్
బాపట్ల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత డీఎస్సీ శిక్షణా శిబిరాన్ని శనివారం బావుడా చైర్మన్‌గా ఇటీవల నియమితులైన సలగల రాజశేఖరబాబుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వడం శుభపరిణామమన్నారు. డీఎస్సీ ద్వారా ప్రభుత్వం సుమారు 17 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాకు 700 ఉపాధ్యాయ పోస్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో 220 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వడానికి శ్రీకారం చుట్టిందన్నారు. నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలని శిక్షణకు ఎంపికైన వారికి సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడమే లక్ష్యంగా చదువుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని ఎదగాలన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ సాధికారితాధికారి జె.రాజా దెబోరా మాట్లాడుతూ డీఎస్పీ పరీక్షలకు ప్రభుత్వం నాణ్యమైన శిక్షణను ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం 43మంది అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు శిక్షణకి రావచ్చన్నారు. సలగల రాజశేఖరబాబు మాట్లాడుతూ యువతకు ఉద్యోగవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ సాధికారిత జిల్లా ఇన్‌చార్జి అధికారి రాజేష్‌దాసు, తహసీల్దార్ షేక్.సలీమా తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 17 , 2024 | 01:27 AM