Raghurama Case: రఘురామ కేసులో కీలక పరిణామం

ABN, Publish Date - Sep 27 , 2024 | 10:11 AM

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుకు సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కస్టడీలో చిత్రహింసలు పెట్టడం నిజమేనని తేలింది. ఈ మేరకు నాటి సీఐడీ సిబ్బంది వాంగూల్మంలో కీలక విషయాలు వెల్లడించారు.

Raghurama Case: రఘురామ కేసులో కీలక పరిణామం

గుంటూరు: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజుకు సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కస్టడీలో చిత్రహింసలు పెట్టడం నిజమేనని తేలింది. ఈ మేరకు నాటి సీఐడీ సిబ్బంది వాంగూల్మంలో కీలక విషయాలు వెల్లడించారు. విచారణ అధికారులకు అన్ని వివరాలను వెల్లడించారు. రఘురామ చిత్రహింసలను వీడియో కాల్‌లో సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్‌కు చూపించడంతో అలా కాదు కొట్టేది అని ఆయన చెప్పినట్టు వివరించారు. వీడియో కాల్‌లో చూసిన వెంటనే ముసుగేసుకున్న నలుగురిని తీసుకుని సునీల్ కుమార్ పైకి వచ్చారని తెలిపారు. రఘురామను కొడుతూ.. వీడియోకాల్లో తమ చీఫ్‌కు చూపామని సీఐడీ పోలీసులు వివరించారు. ముసుగేసుకున్న నలుగురితో కలిసి సీఐడీ చీఫ్ సునీల్ వచ్చారని సెంట్రీ వివరించారు. ఈ మేరకు అందరి నుంచి గుంటూరు పోలీసులు వాంగ్మూలాలు తీసుకున్నారు.


సునీల్ కుమార్ సమక్షంలోనే రఘురామ రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని విచారణలో సిబ్బంది వివరించారు. నిజాలు బయటపడడంతో గూగుల్ టేక్ఔట్ ద్వారా సునీల్ కుమార్ కదలికలను పోలీసులు గుర్తించారు. సీఐడీ చీఫ్‌గా ఉన్న సమయంలో సునీల్ కుమార్ కాల్ డేటాపై కూడా పోలీసులు కన్నేశారు.

నిజాలన్నీ బయటపడడంతో సునీల్ కుమార్ అడ్డంగా బుక్కయ్యారు. ఇక నాడు సీఐడీ విచారణ అధికారిగా ఉన్న విజయ్ పాల్‌ మెడకు కూడా ఉచ్చుబిగుస్తోంది. రఘురామ ఒంటిపై గాయాలు ఉన్నాయని జీజీహెచ్ వైద్యులు వాంగ్మూలం ఇచ్చారు. అయితే అప్పటి జీజీహెచ్ సూపరిండెంట్ ప్రభావతిపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు. దీంతో ఆమె తప్పుడు నివేదికను కోర్టుకు సమర్పించారు. నిజాలు బయపడుతుండడంతో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. విజయ్ పాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

Updated Date - Sep 27 , 2024 | 11:27 AM