CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
ABN, Publish Date - Dec 16 , 2024 | 12:06 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఇవాళ(సోమవారం) పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ హెలిపాడ్‌కు చేరుకున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఇవాళ(సోమవారం) పోలవరంలో పర్యటిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ హెలిపాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల గురించి సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. పోలవరం పనులపై అధికారులు, ఇంజినీర్లతో చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై చర్చించనున్నారు. సమీక్ష తర్వాత పోలవరం పనుల షెడ్యూల్‌ను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇతర నిర్మాణ పనులపై షెడ్యూల్ విడుదల చేయనున్నారు. రోడ్డు మార్గాన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బయలుదేరారు.
పోలవరం రాష్ట్రానికి జీవనాడి: సీఎం చంద్రబాబు
పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం వల్ల 7 లక్షల 20 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఉందని తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉందని తెలిపారు. పోలవరం, అమరావతి రెండు కళ్లు అని చెప్పారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఏపీకి గేమ్ ఛేంజర్‌గా తయారువుతుందని చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఏపీకి గేమ్ ఛేంజర్‌గా తయారువుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం
‘‘పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం. త్వరలో నేరుగా కృష్ణా నుంచి సాగర్ కెనాల్‌కు పూర్తి చేయాలి. గొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే మనకు ఇబ్బంది ఉండదు.వెలిగొండ ఇరిగేషన్‌కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లొచ్చు. విశాఖకు తరలిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధారకు నీళ్లు.. ఇది పూర్తి చేయగలిగితే అన్ని జిల్లాలకు ఎంతో ఉపయోగం. శ్రీకాకుళం నుంచి కర్నూలు, నెల్లూరు, తిరుపతి వరకు నీటి సమస్య ఉండదు. ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్ చేసే సామర్ధ్యం. 93 మీటర్లు డయా ఫ్రం వాల్ అత్యంత ఎత్తైన స్పిల్ వే గేట్లు ఉంటుంది. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
AP News: భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం
TTD: తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..
Read Latest AP News and Telugu News
Updated Date - Dec 16 , 2024 | 02:41 PM