AP News: సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్‌లో కోత.. పెన్షనర్ల మండిపాటు
ABN, Publish Date - Jan 10 , 2024 | 11:34 AM
Andhrapradesh: జిల్లాలోని ముప్పాళ్ళలో వృద్ధాప్య పెన్షనర్లు ఆందోళనకు దిగారు. సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్‌లో 100 రూపాయలు మినహాయింపు ఇచ్చారు.
పల్నాడు, జనవరి 10: జిల్లాలోని ముప్పాళ్ళలో వృద్ధాప్య పెన్షనర్లు ఆందోళనకు దిగారు. సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో ఫించన్‌లో 100 రూపాయలు మినహాయింపు ఇచ్చారు. దీంతో వైసీపీ నేతల కక్కుర్తిపై పెన్షనర్లు మండిపడుతున్నారు. మంత్రి అంబటి... ముగ్గుల పోటీలకి 100 వసూలు చేయమన్నారని పెన్షనర్లు ఆరోపిస్తున్నారు.
అయితే నియోజకవర్గంలో విచ్చలవిడిగా టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సచివాలయాలు టిక్కెట్ కౌంటర్స్‌గా మారగా.. వాలంటీర్స్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే లక్కీ డ్రా టిక్కెట్లు విక్రయాలపై అధికారులు విచారణకు ఆదేశించారు. వంద రూపాయల లక్కీ డ్రాలో బంగారపు వస్తువులు, ట్రాక్టర్లు, కార్లు, బైకులతో ఎర వేసినట్లు తెలుస్తోంది. కాగా.. లక్కీ డ్రాలు చట్టవిరుద్ధమని టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Jan 10 , 2024 | 11:34 AM