ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోళ్లకు... కృత్రిమ మేథ సాయం

ABN, Publish Date - Nov 22 , 2024 | 12:54 AM

ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవడానికి పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఈ దఫా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం రైతులు పడిగాపులు పడాల్సి వచ్చేది.

వాట్సాప్‌ నంబరు 7337359375ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం

ఈ నంబరుని స్టోర్‌ చేసుకొని హెచఐ అని నమోదు చేస్తే చాలు

తదుపరి ఏమి చేయాలో సులభంగా చెప్పేస్తుంది

గుంటూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకోవడానికి పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఈ దఫా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం రైతులు పడిగాపులు పడాల్సి వచ్చేది. అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ధాన్యాన్ని విక్రయించుకోవాల్సిన పరిస్థితి. వీటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ కూటమి ప్రభుత్వం ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స(కృత్రిమ మేథ) సాయాన్ని తీసుకుంటోంది. రాష్ట్ర పౌరసరఫాల సంస్థ వాట్సాప్‌ నంబరు 7337359375ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు ఈ నంబరు ద్వారా ధాన్యాన్ని ఎప్పుడు విక్రయించుకోవచ్చో వారే స్వయంగా తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చు. దీని వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురవుతున్న ఇబ్బందులు వారికి ఉండవని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెప్తున్నారు. రైతులు వాట్సాప్‌ నంబరుకి ఆంగ్లంలో హెచఐ అని నమోదు చేయగానే వెంటనే ధాన్యం కొనుగోలుకు షెడ్యూల్‌, రీషెడ్యూల్‌ చేసుకోండి అని సందేశం వస్తుంది. షెడ్యూల్‌ని క్లిక్‌ చేయగానే దయచేసి మీ ఆధార్‌ సంఖ్యని నమోదు చేయమని కోరుతుంది. ఆధార్‌ నంబరు ఎంట్రీ చేయగానే ఽసమీపంలో ఉన్న ధాన్యం కేంద్రాల జాబితా ప్రదర్శితమౌతుంది. వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న వెంటనే తేదీలను ఇస్తుంది. తేదీని ఎంచుకోగానే టైం స్లాట్‌ ఇస్తుంది. టైంస్లాట్‌ ఎంచుకున్న తర్వాత ధాన్యం రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఎన్ని బస్తాలను అమ్మదలిచారో చెప్పాలని కోరుతుంది. పరిణామం తెలిపిన తర్వాత రైతు పేరు, గ్రామం, షెడ్యూల్‌ చేసిన తేదీ, కూపన కోడ్‌ వస్తుంది. ఒకవేళ రీషెడ్యూల్‌ చేసుకోవాలన్నా ఆ అవకాశం కూడా ఉంటుంది. ఈ-పంట నమోదులో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. రైతు తాను సాగు చేసిన విస్తీర్ణం తక్కువగా ఉండి, ఎక్కువ బస్తాల ధాన్యం విక్రయించాలని చూసినా ఏఐ అనుమతించదు.

Updated Date - Nov 22 , 2024 | 12:54 AM