ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జేకేసీ విద్యార్థి కావడం గర్వకారణం

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:38 AM

జేకేసీ కళాశాల ఎంతో మంది ఉన్నతికి కారణమైంది. ఇలాంటి కళాశాల విద్యార్థినని చెప్పుకోవడం గర్వకారణం. కళాశాలలో అధ్యాపకులు, యాజమాన్యం చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పించారు. ఫలితంగా ఇక్కడ చదివిన ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా రాణిస్తున్నారు.. అని రాష్ట్ర డీజీపీ, జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థి సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

ఆడిటోరియం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు, వేదికపై జీవీ ఆంజనేయులు, మన్నవ మోహనకృష్ణ తదితరులు

ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా రాణిస్తున్న పూర్వ విద్యార్థులు

ఆడిటోరియం ప్రారంభోత్సవంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు

గుంటూరు(విద్య), నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జేకేసీ కళాశాల ఎంతో మంది ఉన్నతికి కారణమైంది. ఇలాంటి కళాశాల విద్యార్థినని చెప్పుకోవడం గర్వకారణం. కళాశాలలో అధ్యాపకులు, యాజమాన్యం చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పించారు. ఫలితంగా ఇక్కడ చదివిన ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా రాణిస్తున్నారు.. అని రాష్ట్ర డీజీపీ, జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థి సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. జాగర్లమూడి లక్ష్మయ్యచౌదరి పేరుతో నిర్మించిన నూతన ఆడిటోరియాన్ని కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పునర్‌ నిర్మించారు. రూ.2.50 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియాన్ని బుధవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ ప్రసంగిస్తూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఎంతోమందికి చదువుతో పాటు సంస్కారం నేర్పించిన ఘనత జేకేసీదన్నారు. ఆకృతిలేని రాళ్ళలాంటి తమలాంటి ఎంతోమందిని శిల్పాలుగా తీర్చిదిద్దన ఘనత జేకేసీ అధ్యాపకులదన్నారు. నాలుగున్నర దశాబ్దాల క్రితం జేకేసీ కళాశాలలో చదువుకున్నానని, అప్పట్లో ఇక్కడ నేర్పిన చదువు, క్రమశిక్షణ కారణంగానే నేషనల్‌ పోలీసు అకాడమీలో చేరినట్లు చెప్పారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ తమకు క్రమశిక్షణ, అంకితభావం కళాశాలలో చదుకునే సమయంలో అలవడ్డాయన్నారు. ఫలితంగానే సేవా, రాజకీయరంగాల్లో రాణిస్తున్నట్లు వారు చెప్పారు. జేకేసీ పూర్వ విద్యార్థులు కావడం తమ అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, జాగర్లమూడి మురళీమోహన్‌, ప్రిన్సిపాల్‌ పరుచూరి గోపిచంద్‌, పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు యర్లగడ్డ ఉమాదేవి, జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ మాదల శ్రీనివాసు, చుక్కపల్లి రమేష్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ యశస్వీ, కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Updated Date - Nov 21 , 2024 | 01:38 AM