ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంతర్‌ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:47 AM

బాపట్ల వ్యవసాయ కళాశాలలో 2024-2025 వ్యవసాయ విశ్వవిద్యాలయం వార్షిక 2వ దశ అంతర్‌ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.

క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న డాక్టర్‌ జి.కరుణా సాగర్‌

బాపట్ల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : బాపట్ల వ్యవసాయ కళాశాలలో 2024-2025 వ్యవసాయ విశ్వవిద్యాలయం వార్షిక 2వ దశ అంతర్‌ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ జి.కరుణా సాగర్‌ ఆయా కళాశాలల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వాలీబాల్‌ పోటీలలో గుంటూరు సీసీఎస్‌, ఉదయగిరి ఎస్‌ఎంజీఆర్‌ జట్లు, అనంతపూర్‌ ఎస్‌కేడీతో బద్వేల్‌ ఎస్‌బీవీఆర్‌ కళాశాల జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో గుంటూరు సీసీఎస్‌, అనంతపూర్‌ ఎస్‌కేడీ జట్లు విజేతలుగా నిలిచాయి. బాల్‌ బ్యాడ్మింటన్‌లో నైరా అగ్రికల్చర్‌ కాలేజితో సిఎస్‌పురం కెబిఆర్‌ కళాశాల జట్టు, బాపట్ల వ్యవసాయ కళాశాల జట్టుతో బాపట్ల ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల జట్టు తలపడ్డాయి. ఈ పోటీలలో నైరా వ్యవసాయ కళాశాల జట్లు, బాపట్ల వ్యవసాయ కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి. టెన్నీకాయిట్‌ పోటీలలో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల, మడకసిర సీఏఈ కళాశాల, ఎచర్ల ఎస్‌కెవై, నైరా వ్యవసాయ కళాశాల క్రీడాకారులు తలపడ్డారు.

ఈ పోటీలలో మడకసిర సీఏఈ, నైరా వ్యవసాయ కళాశాల క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. వాలాబాల్‌ పోటీలలో బాపట్ల వ్యవసాయ కళాశాల జట్టుపై తిరుపతి వ్యవసాయ కళాశాల జట్టు, సిఎస్‌పురం కెబిఆర్‌ కాలేజి జట్టుపై నైరా వ్యవసాయ కళాశాల జట్లు, ఎన్‌ఎస్‌ మార్కాపురం జట్టుపై పులివెందుల సిఎఫ్‌ఎస్‌టి జట్టు, తిరుపతి జేసీడీఆర్‌ జట్టుపై మహానంది వ్యవసాయ కళాశాల జట్టు తలపడ్డాయి. ఆయా పోటీలలో బాపట్ల వ్యవసాయ కళాశాల జట్టు, నైరా వ్యవసాయ కళాశాల జట్టు, ఎన్‌ఎస్‌ మార్కాపురం, మహానంది వ్యవసాయ కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి.

Updated Date - Nov 18 , 2024 | 12:47 AM