ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్నికలకు సిద్ధం
ABN, Publish Date - Dec 16 , 2024 | 12:54 AM
బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ ఎన్నికకు రంగం సిద్ధమైంది.
బాపట్ల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ కార్యవర్గ ఎన్నికకు రంగం సిద్ధమైంది. రెండువర్గాల మధ్య బలమైన పోటీ నెలకొనే అవకాశం ఈ పర్యాయం కూడా ఉంది. మూడేళ్లపాటు కొనసాగే పదవులకు ముఖ్యనాయకులు పోటీ పడుతున్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగుతుందని సభ్యులు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబరు నెలలోనే పాలకవర్గం పదవీకాలం పూర్తయింది. అయినప్పటికి ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావటంతో వారే కొనసాగుతున్నారు. ముప్పలనేని శేషగిరిరావు వారుసుడిగా ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ముప్పలనేని శ్రీనివాసరావు మళ్లీ పోటీకి సిద్ధమౌతున్నట్లు సమాచారం. మూడు దశాబ్దాలుగా ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శిగా ఉన్న మానం నాగేశ్వరరావు మళ్లీ కార్యదర్శిగా పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పర్యాయం అధ్యక్షునిగా దొప్పలపూడి రామ్మోహనరావు కూడా పోటీకి దిగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షునిగా ఉన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 12:54 AM