ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్వాడీలకు.. నిధులు

ABN, Publish Date - Nov 23 , 2024 | 01:00 AM

తాగునీరు.. మరుగుదొడ్ల సౌకర్యం లేక.. భవనాలు రంగులు వెలసి.. అధ్వానంగా ఉండే అంగన్వాడీ కేంద్రాలు అద్భుతంగా మారనున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పోషణ అందించే అంగనవాడీ కేంద్రాలు వైసీపీ ఐదేళ్ల పాలనలో అధ్వానంగా మారాయి. వివిధ సమస్యలతో కునారిల్లిపోయిన అంగన్వాడీలకు గత ప్రభుత్వ హయాంలో పట్టిన గ్రహణం వీడింది.

గుంటూరులో అంగన్వాడీ మరుగుదొడ్డికి రంగులు వేస్తున్న కార్మికుడు

ఐదు స్కీముల కింద రూ.లక్ష చొప్పున..

మూడు జిల్లాల్లోని 5,339 కేంద్రాలకు మహర్దశ

తాగునీరు, మరుగుదొడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

వైసీపీ హయాంలో నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

నిధుల కేటాయింపు ఇలా..

మంచినీటి సదుపాయం రూ.17,000

మరుగుదొడ్ల నిర్మాణం రూ.36,000

మరమ్మతులు, రంగులు రూ.19,800

పెరటి తోట నిర్వహణ రూ.10,000

వర్షపు నీరు నిర్వహణ రూ.16,000

గుంటూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తాగునీరు.. మరుగుదొడ్ల సౌకర్యం లేక.. భవనాలు రంగులు వెలసి.. అధ్వానంగా ఉండే అంగన్వాడీ కేంద్రాలు అద్భుతంగా మారనున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పోషణ అందించే అంగనవాడీ కేంద్రాలు వైసీపీ ఐదేళ్ల పాలనలో అధ్వానంగా మారాయి. వివిధ సమస్యలతో కునారిల్లిపోయిన అంగన్వాడీలకు గత ప్రభుత్వ హయాంలో పట్టిన గ్రహణం వీడింది. వాటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఐదు రకాల స్కీముల కింద భారీగా నిధులు కేటాయించింది. ఆయా నిధులతో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల తలరాత మారబోతోంది. మూడు జిల్లాల్లో మొత్తం 5,339 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా గత వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాలు సమస్యల నిలయాలుగా మారిపోయాయి. కనీస అవసరాలైన మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం కూడా లేని కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. 2014- 19కి ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పెరటి తోటల పెంపకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పెరటి తోటలో మొక్కలు ఎండిపోయినా పట్టించుకోలేదు. చిన్నారుల ఆట వస్తువులు, బొమ్మలకు కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో అంగన్వాడీ కేంద్రాలు అధ్వానంగా తయారయ్యాయి. అవి కేవలం పిల్లలు, తల్లులకు పప్పుబెల్లాలు పంచిపెట్టే కేంద్రాలుగా మారాయి.

భారీగా నిధుల కేటాయింపు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాల్లో పేరుకుపోయిన సమస్యలపై కదలిక వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లోని సమస్యల పరిష్కారానికి భారీగా నిధులు కేటాయించింది. తక్షణ ప్రాతిపదికన అంగన్వాడీ కేంద్రాలకు నిధులు మంజూరు చేసింది. ఆయా కేంద్రాల్లోని తాగునీటి, మరుగుదొడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నిధులు విడుదల చేసింది. పెరటి పంటలకు ‘పోషణ వాటిక’ కింద నిధులు ఇచ్చింది. వర్షపు నీటి నిర్వహణ పేరుతో కూడా నిధులు విడుదల చేసింది. అంగన్వాడీ కేంద్రాల ప్రాంగణాల్లోనే ఆకుకూరలు, పండ్ల మొక్కలు పెంచేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. నిమ్మ, నారింజ, బొప్పాయి, అరటి వంటి పండ్ల మొక్కలతో పాటు తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర వంటి కూరల మొక్కలు పెంచి వాటితోనే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం సూచించింది.

  • గుంటూరు జిల్లా: 152 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.54.72 లక్షలు, 188 కేంద్రాల్లో మంచినీటి సదుపాయానికి రూ.32 లక్షలు, పోషణ వాటిక, వర్షపు నీటి నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన కింద 204 కేంద్రాలకు రూ.93.43 లక్షలు కేటాయించింది.

  • బాపట్ల జిల్లా: 190 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.68.40 లక్షలు, 258 కేంద్రాల్లో మంచినీటి సదుపాయాలకు రూ.43.86 లక్షలు, 261 కేంద్రాల్లో పోషణ వాటికలు, వర్షపు నీటి నిర్వహణకు కోటీ 19 లక్షల 8 వేలు కేటాయించింది.

  • పల్నాడు జిల్లా: 243 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.87.48 లక్షలు, 369 కేంద్రాల్లో తాగునీటి సదుపాయాలకు రూ.62.73 లక్షలు, 67 కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, పోషణ వాటికల ఏర్పాటు, వర్షపునీటి యాజమాన్యం నిర్వహణకు రూ.30.68 లక్షలు కేటాయించింది.

Updated Date - Nov 23 , 2024 | 01:00 AM