ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నాడు ఉరి.. నేడు సరి?

ABN, Publish Date - Jun 15 , 2024 | 12:22 AM

వైసీపీ హయాంలో సీఎం జగన అనాలోచిత నిర్ణయం ఊరి బడికి ఉరిగా మారింది. 117 జీవో.. 500పైగా ప్రాథమిక పాఠశాలల ఉసురుతీసింది. ఈ జీవో వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థకు నష్టమని అటు ఉపాధ్యాయులు, ఇటు మేధావులు ఆందోళన చేసినా వైసీపీ ప్రభుత్వం ఆలకించలేదు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గుంటూరు)

జీవో 117 రద్దు హామీపై ఉపాధ్యాయుల హర్షం

వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో 500పైగా పాఠశాలల మూత

జీవో 117పై ఆందోళనలను పట్టించుకోని నాటి పాలకులు

గుంటూరు(విద్య), జూన 14: వైసీపీ హయాంలో సీఎం జగన అనాలోచిత నిర్ణయం ఊరి బడికి ఉరిగా మారింది. 117 జీవో.. 500పైగా ప్రాథమిక పాఠశాలల ఉసురుతీసింది. ఈ జీవో వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థకు నష్టమని అటు ఉపాధ్యాయులు, ఇటు మేధావులు ఆందోళన చేసినా వైసీపీ ప్రభుత్వం ఆలకించలేదు. ప్రాథమిక తరగతుల విద్యార్థులు బడికి దూరమవుతారని తల్లిదండ్రుల గోడును పట్టించుకోలేదు. విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అయితే ఎన్నికల ప్రచారంలో 117 జీవో రద్దుకు ఎన్టీఏ కూటమి హామీ ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీ ఓటమి పాలవడం.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో జీవో 117 రద్దుతో పాటు విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను సరి చేస్తారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఏ కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ప్రాథమిక పాఠశాలలకు పూర్వవైభవం రానుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. మౌలిక వసతులతో పాటు విద్యార్థులు అక్కడ పూర్తిస్థాయిలో చదువుకునేలా ఏర్పాట్లు చేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

విద్యార్థులు దూరం.. పోస్టులకు కోత

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన 117 జీవోను తెచ్చారు. దీనివల్ల ఐదేళ్లలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 30 వేల మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. మరో 3 వేల మంది విద్యార్థులు డ్రాపవుట్లుగా మిగిలారు. 2500పైగా ఉపాధ్యాయ పోస్టులకు కోత పడింది. లక్షలు వెచ్చించి అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక మూత వేయాల్సిన దుస్థితి నెలకొంది. జీవో 117తో ఊరి బడికి ఉరి వేయవద్దని ఉపాధ్యాయ సంఘాలు నెత్తినోరు బాదుకున్నా జగన ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3500పైగా పైగా ప్రాథమిక పాఠశాలలు ఉండగా ఆయా పాఠశాలల్లో విద్యాశాఖ లెక్కల ప్రకారమే 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడానికే వైసీపీ ప్రభుత్వం జీవో 117 తీసుకువచ్చింది. ఈ జీవోతో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఉన్నత పాఠశాలలు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడికి పంపేందుకు వెనుకంజ వేశారు. ఇంటి సమీపంలోని బడి మూతతో ఈ దుస్తితి నెలకొందని వారు వాపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సాధారణంగా 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థులు పదేళ్లలోపే ఉంటారు. వీరంతా సుదూరంగా ఉండే ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పిల్లల్ని తల్లిదండ్రులు తమకు అందుబాటులో ఉండే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. 1, 2 తరగతులు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించేవారు లేక ఆవి క్రమంగా నిర్వీర్యం అయ్యేస్థాయికి వచ్చాయి. మరోపు ఉన్నత పాఠశాలల్లో కూడా 3, 4, 5 తరగతుల్లో చేర్పించడానికి కూడా తల్లిదండ్రులు ముందుకు రాలేదు. దీంతో ఒక్క పల్నాడు జిల్లాలోనే దాదాపు 200పైగా పాఠశాలలు ఈ ఏడాది విద్యార్థులు లేక మూత పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాలు నాయకులు వెల్లడిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారాల్లో జీవో 117 రద్దుకు సంబంధించి టీడీపీ సహ జనసేన, బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. వైసీపీ అధికారం కోల్పోయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గతంలో వారిచ్చినట్లుగా జీవో 117 రద్దు అవుతుందని.. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ వైభవం వస్తోందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Jun 15 , 2024 | 12:23 AM

Advertising
Advertising