ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raghurama: రఘురామ కస్టోడియల్ కేసులో నిందితులకు వరుస ఎదురుదెబ్బలు

ABN, Publish Date - Dec 13 , 2024 | 01:07 PM

Andhrapradesh: రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతికి గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అయితే ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ఆర్‌ఆర్‌ఆర్ కస్టోడియల్ కేసులో డాక్టర్ ప్రభావతి ఏ5 గా ఉన్నారు.

Raghu Rama Krishnam Raju

గుంటూరు, డిసెంబర్ 13: మాజీ ఎంపీ, ఉండి టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (TDP MLA Raghurama Krishnam raju) కస్టోడియల్ కేసులో డాక్టర్ ప్రభావతికి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అయితే ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ఆర్‌ఆర్‌ఆర్ కస్టోడియల్ కేసులో డాక్టర్ ప్రభావతి ఏ5 గా ఉన్నారు.

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్


కాగా.. రఘురామ కృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో నిందితులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రఘురామను గతంలో ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం కోర్టు పంపించింది. ఈ క్రమంలో ఆయన కాళ్ళుపై దెబ్బలు ఉన్నాయని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను అప్పటి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తారుమారు చేశారని వైద్యలు తెలిపారు. దీంతో అప్పటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ను సికింద్రాబాద్‌ను ఆర్మీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం సుప్రీం కోర్టు పంపించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ కాలికి గాయాలు ఉన్నాయని ఆర్మీ ఆసుపత్రి పేర్కొంది.

Hyderabad: భార్య దోసెలు వేసి తెచ్చేలోపే భర్త ఆత్మహత్య..


జైలు నుంచి విడుదల అయిన వెంటనే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో రఘురామ పిటిషన్ వేయడంతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు ఎస్పీకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో దర్యాప్తు అధికారి విజయాపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా కోర్టు డిస్మస్ చేసింది. ఈ కేసులో ఆర్‌ఆర్‌‌ఆర్‌ తరపున హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించారు.


ఇవి కూడా చదవండి...

భయంతో పేర్ని ఫ్యామిలీ పరార్..!

జగన్ అక్రమాస్తుల కేసు... తాజా అప్‌డేట్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 01:11 PM