ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చీఫ్‌విప్‌ జీవీకి బ్రహ్మరథం

ABN, Publish Date - Nov 24 , 2024 | 01:19 AM

ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి శనివారం వినుకొండ నియోజకవర్గానికి విచ్చేసిన జీవీ ఆంజనేయులుకు కూటమి శ్రేణులు బ్రహ్మరఽథం పట్టాయి.

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులుకు ఘనస్వాగతం పలుకుతున్న పార్టీ శ్రేణులు

వినుకొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ చీఫ్‌విప్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి శనివారం వినుకొండ నియోజకవర్గానికి విచ్చేసిన జీవీ ఆంజనేయులుకు కూటమి శ్రేణులు బ్రహ్మరఽథం పట్టాయి. అడుగడుగునా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆంజనేయులను ఘనంగా సత్కరించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద కూటమి నేతలు, కార్యకర్తలు జీవీకి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఊరేగింపు వినుకొండలోని శివయ్యస్తూపం వరకు సాగింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాణసంచా పెద్దఎత్తున కాల్చారు. ఎక్స్‌కవేటర్లతో గజమాలలతో జీవీని సత్కరించారు. మహిళలు నీరాజనాలు పలికారు. యువకులు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై నుంచి ఆంజనేయులు ప్రజలకు అభివాదం చేశారు. శావల్యాపురంలో ఎన్టీఆర్‌, పరిటాల రవి, వినుకొండలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు జీవీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినుకొండలో జరిగిన సభలో జీవీ మాట్లాడుతూ చీఫ్‌విప్‌ పదవితో క్యాబినెట్‌ హోదా దక్కడం వినుకొండకు గర్వకారణమన్నారు. వినుకొండను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం గంగినేని కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జీవీని సత్కరించారు.

Updated Date - Nov 24 , 2024 | 01:19 AM