ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీలో జపాన్‌ విద్యా విధానం

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:29 AM

ఆంధ్రప్రదేశలో జపాన్‌ విద్యా విధానం అమలు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జపాన్‌ బృందానికి మెమొంటో అందజేస్తున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య రామ్మోహన్‌రావు, వీసీ ఆచార్య గంగాధరరావు

టోయామా యూనివర్సిటీతో ఒప్పందం

విద్య, అధ్యాపక, పరిశోధనలకు ప్రణాళికలు

ఏఎన్‌ యూలో సమావేశం.. హాజరైన ఆరు వర్సిటీల వీసీలు

పెదకాకాని, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశలో జపాన్‌ విద్యా విధానం అమలు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో జపానకు చెందిన టొయామా విశ్వవిద్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం 2015 చేసుకున్న ఒప్పందం తిరిగి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జపాన బృందంతో ఏపీలోని ఆరు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా టోయామా యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, విద్యార్థి, అధ్యాపక, పరిశోధన రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు అంగీకారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌, పలు యూనివర్సిటీల వీసీలు తెలిపిన వివరాలను పరిశీలించిన జపాన్‌ ప్రతినిధుల బృందం సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో ‘కొలాబరేటివ్‌ డైలాగ్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ బిట్వీన్‌ టోయామా ప్రీఫెక్చర్‌ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అనే అంశంపై జరిగిన చర్చలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాత్కాలిక చైర్మన్‌ ఆచార్య కే.రామ్మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో జపాన్‌ దేశ విద్యా విధానాన్ని కొనసాగించే క్రమంలో ఆయా రాష్ర్టాల్లో ఉన్న జపాన్‌ విద్య విధానంపై ఏపీలో అమలు చేసే అంశాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. అందులో భాగంగా జపాన్‌ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలుకు పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. జపనీస్‌ భాషపై ప్రత్యేక కోర్సును విద్యార్థులకు అందించాలని కూడా సూచించారన్నారు. నాగార్జున యూనివ ర్సిటీ వీసీ ఆచార్య కే.గంగాధర రావు మాట్లాడుతూ వర్సిటీ నుంచి ఇద్దరు విద్యార్థులు సుకుర సైన్స్‌ ఎక్చేంజ్‌ ప్రోగ్రాంలో భాగంగా టొయామ యూనివర్సిటీని సందర్శించి పలు అంశాల్లో నైపుణ్యాలు పెంచుకున్నార న్నారు. ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ డివిజన్‌ డైరెక్టర్‌ యూకో హోంగో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలతో ఒప్పందాలకు తాము సిద్థంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే నెలలో టొయామా గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ఉంటుందని ఆపర్యటనలో ఒప్పందాలను ఖరారు చేసుకోనున్నట్లు తెలిపారు. యూజీ, పీజీ, రీసెర్చ్‌, సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మసీవంటి కోర్సులపై దృష్టిసారిస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్య మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య ఉమామహేశ్వరిదేవి, ఇండస్ర్టి యల్‌ లొకేషన్‌ అండ్‌ ట్రేడ్‌ డివిజన్‌ లాజిస్టిక్‌ అండ్‌ట్రేడ్‌ డైరెక్టర్‌ హిదేహిస, ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ డివిజన్‌ సెక్షన్‌ చీఫ్‌ ఏఐ డోబు, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ మాజీ కోఆర్డినేటర్‌ దాసరి రమేష్‌, పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఆచార్య వెన్నం ఉమ, వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీ ఆచార్య సిహెచ్‌. అప్పారావు, ఆంధ్ర యూనివర్సిటీ రెక్టార్‌ ఆచార్య ఎన్‌.కిషోర్‌బాబు, జేఎన్టీ యూ అనంతపురం ఉపకులపతి ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శన్‌రావు, జేఎ న్టీయూ కాకినాడ ఉపకులపతి ప్రొఫెసర్‌ కేవీఎస్‌డీ మురళీకృష్ణ, నాగార్జున యూనివర్సిటీ రెక్టార్‌ ఆచార్య రత్నషీలామణి, రిజిస్ర్టార్‌ ఆచార్య జి.సింహా చలం, ఐక్యూఏసీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.కృష్ణసత్య, ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.పద్మావతి, ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఆచార్య సిద్ధయ్య, ఆచార్య ప్రమీలారాణి, వెంకటేశ్వర యూనివ ర్సిటీ నోడల్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌, ఇండో జపనీస్‌ కొలాబరేషన్‌ కన్సల్టెంట్‌ స్వాతి భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 01:29 AM