ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దీపోత్సాహం

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:25 AM

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు, కృష్ణానది, సముద్ర తీర ప్రాంతాలు, గృహాలు దీపాల వెలుగులతో కాంతులీనాయి.

అమరావతి: కృష్ణానదిలో హంసవాహనంపై స్వామివార్ల తెప్పోత్సవం

భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు

వైభవంగా కోటి దీపోత్సవం, జాల్వాతోరణం

సూర్యలంక తీరంలో జలవందనం జనసంభరం

కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామికి విశేష అభిషేకాలు

అమరావతిలో పుణ్య హారతులతో పులకించిన కృష్ణమ్మ

నరసరావుపేట, అమరావతి, బాపట్ల, పెదకాకాని, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవక్షేత్రాలు, కృష్ణానది, సముద్ర తీర ప్రాంతాలు, గృహాలు దీపాల వెలుగులతో కాంతులీనాయి. హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణతో ఆలయాలు, నదీ, సముద్ర తీర ప్రాంతాలు మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతోనూ, ఉత్సాహాంగా శుక్రవారం జరుపుకున్నారు. భక్తులతో జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. కృష్ణానదీ తీరంతో పాటు బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరం భక్తులతో పోటెత్తింది. పుణ్యస్నానాలాచరించిన భక్తులు కార్తీక దీపారాధనలు చేసి గౌరమ్మకు పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. పౌర్ణమిని పురష్కరిచుకుని ఆలయాల్లో రుద్రాభిషేకాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారు జామునే ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయాల వద్ద శివలింగాకరంలో కోటి దీపోత్సం నిర్వహించారు. కోటప్పకొండ, అమరావతి, పెదకాకాని ఆలయాల్లో స్వామివార్ల దర్శనాలకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణాల్లో కోటి దీపోత్సవం, జాల్వా తోరణం కార్యక్రమాలను భక్తులు తిలకించి పులకించిపోయారు.

-కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అభిషేకాల నిర్వహించి కోటయ్య స్వామికి విశేష అలంకారం చేశారు. వేలాది భక్తులతో గిరి ప్రదక్షణ కోలాహలంగా సాగింది. రాత్రి నేత్రపర్వంగా జ్వాలా తోరణం జరిగింది. ఈ సందర్భంగా స్వామికి అఖండ పూజ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

- పంచారామ పుణ్యక్షేత్రాల్లో ప్రథమ ఆరామమైన అమరారామం అమరావతికి భక్తులు పోలెత్తారు. తెల్లవారుజామున నుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు. బాణలింగానికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ దంపతులుస్వామివార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించి, కృష్ణవేణికి చీర సారె సమర్పించారు. దూప, పంచ, నంది, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులను నదీమాతకు సమర్పించగా స్నానఘాట్ల నుంచి వేలాది మంది భక్తులు కనులారా వీక్షించారు. విద్యుత్‌ దీపాలు, పూలతో అలంకరించిన హంస వాహనంపై బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి తెప్పోత్సవం కృష్ణానది అలలపై కన్నులపండువగా జరిగింది.

- ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంక జనసంద్రంతో పులికించింది. పెద్దసంఖ్యలో భక్తులు తీరంలో దీపాలను వెలిగించి సముద్రుడికి, తారకేశ్వరస్వామి, శ్రీఆంజనేయస్వామిలకు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు లక్ష మంది భక్తులు తీరంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. తీరంలో సాగరహారతి అట్టహాసంగా జరిగింది. తీరం ఒడ్డున ఏర్పాటు చేసిన శివలింగానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ దంపతులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో సముద్రుడికి సాగర హారతులను ఇచ్చారు.

- పెదకాకాని మల్లేశ్వరస్వామి సన్నిధి కార్తీక దీపాల వెలుగులతో నిండిపోయింది. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపారాధనలు చేశారు. హైకోర్టు విశాంత్ర న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకర్‌, ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ దంపతులు స్వామివారిని దర్శించుకునిని అభిషేక సేవలో పాల్గొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 01:25 AM