ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాల్వల మరమ్మతులు చేపట్టాలి: ములకా

ABN, Publish Date - May 31 , 2024 | 01:30 AM

పంట కాల్వలు, మురుగు కాల్వల మరమ్మత్తు పనులుసత్వరమే చేపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్‌ చేశారు.

కాల్వల దుస్థితిని పరిశీలిస్తున్న శివసాంబిరెడ్డి, అప్పారావు

తెనాలి రూరల్‌, మే 30: పంట కాల్వలు, మురుగు కాల్వల మరమ్మత్తు పనులుసత్వరమే చేపించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావుతో కలిసి ఫీడర్‌ చానల్‌ తదితర కాల్వలను పరిశీలించారు. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ కంచెర్లపాలెం, సోమసుందరపాలెం, తేలప్రోలు, ఐతానగర్‌, నేలపాడు, అత్తోట గ్రామాల్లోని 6000 ఎకరాల భూములకు ఈ కాలువల ద్వారా సాగునీరు అందాల్సి ఉందన్నారు. ఈ కాలువలలో సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో గత సంవత్సరం కూడా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని ఆరోపించారు. ఖరీఫ్‌ సాగుకు మరో నెలలో పనులు ప్రారంభం కానున్నాయని ఇప్పటి వరకూ కనీసం కాలువలో పూడిక తీసే పనులను అధికారులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. అధికార యంత్రాంగం కాలువలపై దృష్టిపెట్టి మరమ్మతులు చేపట్టి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని శివసాంబిరెడ్డి కోరారు. పలువురు రైతుసంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 01:30 AM

Advertising
Advertising