ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు

ABN, Publish Date - Nov 24 , 2024 | 01:11 AM

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్‌ - 14 బాలబాలికల ఖోఖో పోటీలు కారంపూడి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత హైస్కూల్‌లో శనివారం ప్రారంభమయ్యాయి.

శ్రీకాకుళంపై విజయం సాధించిన గుంటూరు జిల్లా జట్టు

రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు

12 జట్లు.. 25వ తేదీ వరకు నిర్వహణ

కారంపూడి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్‌ - 14 బాలబాలికల ఖోఖో పోటీలు కారంపూడి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత హైస్కూల్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. మొత్తం 12 జట్లు పోటీల్లో పాల్గొననున్నాయి. ఈ నెల 25వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. శ్రీకాకుళంపై గుంటూరు జట్టు విజయం శనివారం జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో గుంటూరు జట్టు శ్రీకాకుళం జట్టుపై 12-11 తేడాతో విజయం సాధించింది. విశాఖపట్నం జట్టు అనంతపురం జట్టుపై 17-15, ఈస్ట్‌గోదావరి జట్టు నెల్లూరు జట్టుపై 15-13, విజయనగరం జట్టు వెస్ట్‌గోదావరి జట్టుపై 14-7 తేడాతో గెలుపొందాయి. బాలికల విభాగంలో వెస్ట్‌గోదావరి జట్టు కర్నూలు జట్టుపై 10-6, విజయనగరం జట్టు నెల్లూరు జట్టుపై 6-3, అనంతపురం జట్టు కృష్ణా జట్టుపై 15-1, కడప జట్టు గుంటూరు జట్టుపై 9-7 తేడాతో గెలుపొందాయి. ఈ పోటీలను హెచఎం రఘుబాబు, పీఈటీలు స్వర్ణరాజు శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మన బాలునాయక్‌, పూర్వ విద్యార్థి సంఘ నేత షేక్‌ మోదీనసాలు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 01:11 AM