ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: పవన్ కళ్యాణ్‌తో కొణతాల భేటీ.. ఏం చర్చించారంటే..?

ABN, Publish Date - Jan 17 , 2024 | 09:26 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) బుధవారం కలిశారు. వీరిద్దరూ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ( Pawan Kalyan ) ని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీమంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) బుధవారం కలిశారు. వీరిద్దరూ కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏపీ రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులపై పవన్ - కొణతాల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఉత్తరాంధ్రలో పార్టీ బలబలాలపై కూడా చర్చించినట్లు సమాచారం. త్వరలోనే జనసేనలో చేరనున్నట్లు కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి కొణతాల రామకృష్ణ టిక్కెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. మంచిరోజు చూసుకొని ఈ నెలలోనే జనసేనలో చేరతానని కొణతాల రామకృష్ణ తెలిపారు.

కొణతాలకు రాజకీయాల్లో అపారమైన అనుభవం

కాగా.. కాంగ్రెస్‌లో కొణతాల రామకృష్ణ సీనియర్ నేతగా ఎదిగారు. పలుమార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. అయితే వైసీపీ ఆవిర్భావంలో జగన్‌‌కి అండగా నిలిచారు. 2014 ఎన్నికల తర్వాత కొణతాల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు జనసేనలోకి వచ్చేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 09:30 PM

Advertising
Advertising