ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.కోట్లలో.. కిక్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 01:32 AM

కోరుకున్న బ్రాండ్లు.. కావాల్సిన మద్యం.. గతంలోలా చెల్లింపులకు పరిమితులు లేకపోవడం.. కొన్ని బార్లలోనూ ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు.. నేపథ్యంలో అటు మందుబాబులు, ఇటు ఎక్సైజ్‌ శాఖ ఖుషీ చేసుకుంటోంది.

మార్కెట్‌లో రూ.99 మద్యం

నెల వ్యవధిలో రికార్డు స్థాయిలో అమ్మకాలు

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రూ.260 కోట్లకు తాగేశారు

బాపట్ల జిల్లాలో రూ.86 కోట్ల మద్యం విక్రయం

జగన్‌ హయాంలో కన్నా ఒక్క నెలలో రూ.20 కోట్ల అదనపు సేల్‌

గుంటూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కోరుకున్న బ్రాండ్లు.. కావాల్సిన మద్యం.. గతంలోలా చెల్లింపులకు పరిమితులు లేకపోవడం.. కొన్ని బార్లలోనూ ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు.. నేపథ్యంలో అటు మందుబాబులు, ఇటు ఎక్సైజ్‌ శాఖ ఖుషీ చేసుకుంటోంది. మందుబాబులు తెగ తాగేస్తోండగా.. ఎక్సైజ్‌ శాఖకు రూ.కోట్లు కిక్కు వస్తోంది. బ్రాందీ షాపుల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. జగన్‌ హయాంలో గత ఐదేళ్ళుగా జేబులో దండిగా డబ్బులున్నా కూడా కోరుకున్న మద్యాన్ని కొనుక్కొని తాగలేని పరిస్థితి ఉండేది. పేరొందిన డిస్టలరీల కంపెనీలు ఉత్పత్తి చేసే మద్యంకు బదులు జే బ్రాండ్‌ పేరుతో నాశిరకం మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించారు. గత్యంతరం లేక పలువురు నాశిరకం మద్యాన్ని కొనుగోలు చేసి తాగి ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోరుకున్న మద్యం అందుబాటులోకి తెస్తామని, చౌక మద్యాన్ని నాణ్యంగా అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు రాష్ట్రంలో అప్పటి వరకు కొనసాగుతున్న మద్యం పాలసీని మార్చేశారు. ప్రభుత్వ దుకాణాల స్థానే ప్రైవేటు దుకాణాలు ఏర్పాటు చేశారు. గతంలో ఉండే కేవలం నగదు లావాదేవీలు తొలగించి డిజిటల్‌ పేమెంట్స్‌ను కూడా అమల్లోకి తెచ్చారు. గత నెల దసరా పండుగ రోజు నుంచి కొత్త మద్యం షాపులు వెలిశాయి. అప్పటి వరకు కేవలం జేబులో నగదు ఉంటే మాత్రమే మద్యం కొనుక్కునే అవకాశం ఉండేది. డిజిటల్‌ లావాదేవీలు అమల్లోకి రావడంతో క్రెడిట్‌కార్డులు ఉన్నవారు సైతం ఎంచక్కా వైన్‌ షాపులకు వెళ్ళి మద్యం కొనుగోలు చేస్తున్నారు. దసరా పండుగ ముందు వరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికే మద్యం బ్రాండ్ల పేర్లు కూడా వింతగా ఉండేవి. బూమ్‌..బూమ్‌, బ్రిటీష్‌ ఎంపైర్‌ వంటి బీర్లు, ఆంధ్రగోల్డ్‌ విస్కీ, హైదరాబాద్‌ బ్లూ విస్కీ, ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీలు వంటివి మాత్రమే అందుబాటులో ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన కొత్త మద్యం షాపుల్లో ఏ బ్రాండ్‌ మద్యమైనా అందుబాటులోకి వచ్చింది. కింగ్‌ ఫిషర్‌, బడ్వైజర్‌, నాకౌట్‌ వంటి ప్రముఖ బ్రాండెడ్‌ బీర్లు దొరుకుతున్నాయి. దీంతో ఈ నెల రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత నెల 16 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అంటే 30 రోజుల్లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రూ.259 కోట్ల 19లక్షల అమ్మకాలు జరిగాయి. ఇందులో రూ.208 కోట్ల విలువ చేసే మద్యం కేవలం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్‌ షాపుల ద్వారానే జరిగింది. మిగతా అమ్మకాలు బార్లు, క్లబ్‌లలో జరిగాయి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో భాగంగా గుంటూరు జిల్లాలో 127, పల్నాడు జిల్లాలో 129, బాపట్ల జిల్లాలో 117 కొత్తగా వెలిశాయి. అయితే బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కంటే గుంటూరు జిల్లాలోనే మద్యం దుకాణాల ద్వారా ఎక్కువ అమ్మకాలు జరిగాయి. పల్నాడు జిల్లాలో రూ.93 కోట్లు, బాపట్ల జిల్లాలో రూ.86 కోట్ల మద్యం అమ్మకం జరిగింది. ఇక గుంటూరు జిల్లాలో రూ.115 కోట్లకుపైగా విలువ చేసే మద్యం విక్రయించారు. ఇందులో ఒక గుంటూరు నగరంలోనే రూ.50 కోట్ల మద్యాన్ని కేవలం దుకాణాల ద్వారానే కొనుగోలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాల్లోనే రూ.34 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. తూర్పు నియోజకవర్గ పరిఽధిలో రూ.16 కోట్ల అమ్మకాలు జరిగాయి. చిలకలూరిపేట ప్రాంతంలో అత్యధికంగా రూ.13 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. అక్టోబరు 16కు ముందు జగన్‌ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండేవి. అప్పటి అమ్మకాలతో బేరీజు వేసుకుంటే ప్రస్తుతం ఇంచుమించు నెలకు రూ.20 కోట్ల అమ్మకాలు పెరిగాయి.

సరఫరాకు మించి రూ.99 మద్యానికి డిమాండ్‌

కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా డిస్టలరీ కంపెనీలకు ఇచ్చిన ఆదేశాల మేరకు నాణ్యతతో కూడుకున్న చౌక మద్యం రూ.99కే అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో తొలుత ఈ మద్యం అందుబాటులో లేదు. అయితే కొద్ది రోజులు ఆలస్యంగానైనా సరే మార్కెట్లోకి రూ.99 మద్యం వచ్చింది. ఈ నేపథ్యంలో వీఎస్‌వోపీ వారి బ్రాందీ(ట్రోపికాన)కు డిమాండ్‌ విపరీతంగా ఉంది. ఇది డిమాండ్‌కు తగ్గట్లుగా ప్రస్తుతానికి సరఫరా లేదు. దీంతో డిపోల నుంచి షాపుల నిర్వాహకులు కోరినంత ఇవ్వలేకపోతున్నారు. త్వరలో ఈ బ్రాండ్లను కూడా భారీగా డంప్‌ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.

Updated Date - Nov 21 , 2024 | 01:32 AM