ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లాటరీ టిక్కెట్లు.. డూప్లికేటు

ABN, Publish Date - Nov 15 , 2024 | 01:44 AM

లాటరీ టిక్కెట్లపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో నిషేధం ఉంది. అయినా బహిరంగంగానే టిక్కెట్‌లు అమ్మేస్తున్నారు.

ఫ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ వైసీపీ నేత హవా

ఫ అసలుతోపాటు నకిలీలూ కోకొల్లలు..

రూ.కోట్ల దోపిడీ

ఫ 2023లో విజయనగరంలో వెలుగుచూసిన

ఘరానా మోసం

ఫ తెనాలిలో మూలాలు గుర్తించినా

అప్పటి నేతల ఒత్తిడితో చర్యలు శూన్యం

ఫ ప్రస్తుతం ప్రభుత్వం మారినా ఆగని దందా..

పడని అడ్డుకట్ట

తెనాలి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): లాటరీ టిక్కెట్లపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో నిషేధం ఉంది. అయినా బహిరంగంగానే టిక్కెట్‌లు అమ్మేస్తున్నారు. అయితో వీటిలో అసలు టిక్కెట్లు 100 ఉంటే, దానికి పది రెట్లు నకిలీ టిక్కెట్లు ఉన్నాయి. వైసీపీ సర్కారు పోయి, కూటమి ప్రభుత్వం వచ్చినా గంజాయి కంటే ప్రమాదకారిగా పేదల రెక్కల కష్టాన్ని దోచేస్తున్న ఈ నకిలీ దందా గుట్టుపై మాత్రం ఇంకా కన్నుపడలేదు. 2023లోనే విజయనగరం, శీకాకుళం జిల్లాల్లో నకిలీ లాటరీ టిక్కెట్ల గుట్టు బయటపడినా అప్పట్లో వారికి అధికారపార్టీ నేతల అండదండలు ఉండటంతో చర్యలేమీ లేవు. అయితే రెండు రాష్ట్రాల్లో లాటరీ దందాకు మూల కేంద్రం తెనాలే కావడం వణుకుపుట్టించే విషయం. గంజాయి, బెట్టింగ్‌ల వంటివాటి విషయంలో ఇప్పటికే తెనాలికి అక్రమార్కులు ఖ్యాతిని తీసుకొస్తే, ఇప్పుడు లాటరీ టిక్కెట్ల వ్యవహారం కనిపించకుండా వేళ్లూనుకుపోవటం కలవర పరిచే విషయం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గతేడాది ఈ లాటరీ టిక్కెట్లు, వాటి మాటునే గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్న నకిలీ లాటరీ టిక్కెట్ల వ్యవహారం బయటపడింది. అక్కడ తీగలాగితే లాటరీ దందా డొంక తెనాలిలో తేలింది. ఆయా జిల్లాల పోలీసులు తెనాలి వచ్చి సోదాలు నిర్వహించారు. దీంతో లాటరీ టిక్కెడ్ల బండారం బయటకు పొక్కింది. నిషేధిత లాటరీ వ్యవహారంలో సూత్రధారి తెనాలిలోని వైసీపీకి చెందిన ఓ నాయకుడని తేల్చారు. అయితే అతడిపై చర్యలు లేకుండా అప్పట్లో పోలీసులపై ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో చేసేదిలేక సూత్రధారులను పట్టుకోకుండానే పోలీసులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. శ్రీకాకుళం పోలీసులకు వైసీపీ సర్కారులోని ఓ ముఖ్యనేత, సీఎంవో నుంచి వార్నింగ్‌లు వచ్చాయి. ఆ తర్వాత ఈ అక్రమ వ్యాపారానికి అడ్డేలేని పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి నిషేధిత లాటరీ టిక్కెట్ల వ్యవహారం నేటికీ మూడు అసలు టిక్కెట్‌లు... ఆరు నకిలీ టిక్కెట్‌ల తరహాలో సాగిపోతూనే ఉంది. అప్పట్లో విజయనగరం జిల్లాలో ఇద్దరు స్నేహితులు రెండు లాటరీ టిక్కెట్లు కొనగా ఒకరికి రూ.కోటి గెలుచుకోగా, టిక్కెట్‌లు అమ్మిన వ్యాపారి మొండి చెయ్యిచూపాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా లాటరీ టిక్కెట్ల వ్యవహారం వెలుగుచూసింది. అయితే ఒక్క శ్రీకాకుళమే కాకుండా విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు వంటి మరికొన్ని జిల్లాలు, ఆయా జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలే కేంద్రాలుగా వీరి దందా సాగిపోతూ వస్తోంది. చివరకు పట్టణాలు కాకుండా, మండల కేంద్రాలు, పల్లెలనూ వదలకుండా అక్రమ లాటరీ టిక్కెట్‌ల దందాను నడుపుతున్నారని అప్పట్లో పోలీసులే గుర్తించారు.

అసలు కంటే నకిలీలతో ఘరానా మోసం

అసలు టిక్కెట్‌లు కొని కూలి డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి చాలాచోట్ల ఉంటే, వాటిలో నకిలీ లాటరీ టిక్కెట్‌లు కలిపి అమ్మేస్తూ ఘరానా మోసానికి తెగబడుతున్నారంటే ఎంత దారుణం. ఈ అక్రమార్కులకు అసలు టిక్కెట్ల కంటే, నకిలీలే మంచి ఆదాయ వనరుగా మారిపోయాయి. ఉదాహరణకు సిక్కిం, నాగాలాండ్‌ లాటరీల వంటివాటి నుంచి రూ.లక్ష విలువైన లాటరీ టిక్కెట్లను ఈ నేత కొనుగోలు చేస్తాడు. వాటిని తమ వ్యాపారానికి ఎంపిక చేసుకున్న బడ్డీకొట్లకు పంపుతాడు. అసలు టిక్కెట్లు కొంటేనే వాటిలో అదృష్టం కలిసొచ్చి లాటరీ తగలడం కష్టం, ఇంక వీటికి నకిలీలు కలిపేసి అమ్మితే లక్షల మంది ఆదృష్టం ఘరానా మోసం మాటున కొట్టుకుపోయినట్టే. అంటే ఆయా లాటరీ సంస్థల నుంచి ఒక వెయ్యి నంబర్ల వరకు టిక్కెట్లు కొంటే, వాటి సీరియల్‌ నంబర్‌ 200 నుంచి 1200 వరకు ఉన్నాయనుకుందాం. వీటి విలువ కూడా రూ.లక్ష అనుకుంటే, ఈయన మాత్రం వాటికి మరో రూపది లక్షల నుంచి రూ.కోటి వరకు టిక్కెట్‌ విలువ ఆధారంగా నకిలీ టిక్కెట్లు కొత్త నంబర్‌లతో ముద్రించేసి ఆయా దుకాణాల ద్వారా అమ్మేస్తున్నాడు. ఈ రూపంలోనే ఆ నేత రూ.కోట్లకు పడగలెత్తాడని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు లాటరీ టిక్కెట్‌ల వ్యవహారంలో పోలీసులు పట్టుకున్నా నిషేధిత లాటరీ టిక్కెట్ల విక్రయంపైనే కేసులు నమోదు చేసేవారు. అయితే ఈ నకిలీ రాకెట్‌ విషయం మాత్రం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బయటకు వచ్చాకే తెరపైకొచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా పోలీసులు దృష్టిపెడితే పేదల రెక్కల కష్టం దోపిడీకి గురి కాకుండా కాపాడినవారవుతారు.

Updated Date - Nov 15 , 2024 | 01:44 AM