జీరో వ్యాపారానికి సహకరిస్తే చర్యలు
ABN, Publish Date - Nov 14 , 2024 | 12:51 AM
మిర్చియార్డులో వేమన్లు జీరో, రేట్ కటింగ్, బిల్ టూ బిల్ వ్యాపారాలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పర్సన ఇనచార్జి, జేసీ భార్గవతేజ హెచ్చరించారు.
యార్డు పర్సన ఇనచార్జి, జేసీ భార్గవతేజ
గుంటూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మిర్చియార్డులో వేమన్లు జీరో, రేట్ కటింగ్, బిల్ టూ బిల్ వ్యాపారాలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పర్సన ఇనచార్జి, జేసీ భార్గవతేజ హెచ్చరించారు. బుధవారం యార్డు పరిపాలన భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యార్డులోకి వచ్చే ప్రతీ మిర్చి టిక్కీని ఎరైవల్స్‌లోకి తీసుకురావాలన్నారు. జీరో, రేట్ కటింగ్ బిజినెస్‌లను రూపు మాపాలని స్పష్టం చేశారు. సీజనలో కాటాలు ఆలస్యం కాకూడదన్నారు. సమావేశంలో మిర్చియార్డు సెలెక్షన గ్రేడ్ సెక్రెటరీ వినుకొండ ఆంజనేయులు, సెక్రెటరీలు సుబ్రహ్మణ్యం, శ్రీకాంత తదితరులు పాల్గొన్నారు.
దిగుమతి వ్యాపారుల డుమ్మా
మిర్చియార్డు పర్సన ఇనచార్జి భార్గవతేజ ఏర్పాటు చేసిన సమావేశానికి దిగుమతి వ్యాపారుల సంఘ నాయకులు ముఖం చాటేశారు. మంగళవారం నుంచి యార్డు సూపర్‌వైజర్లు పలుమార్లు ఫోన్లు చేసి సమావేశం గురించి సమాచారాన్ని ఇచ్చినా వారు పట్టించుకోలేదు. తాము స్థానికంగా అందుబాటులో లేమని చెప్పి గైర్హాజరయ్యారు. అసోసియేషన అధ్యక్షుడు లేకపోతే మిగిలిన వారు కూడా ఏ కారణంతోనే రాలేదు. చివరికి అధికారులు అనామకులను తీసుకొచ్చి సమావేశంలో కూర్చోబెట్టడం చర్చనీయాంశమైంది.
రాజకీయ ఒత్తిళ్లు ఉంటే మేమేమి చేయగలం
కొంతమంది అధికారులు తమపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, లారీల కిరాయి విషయంలో ఏకాభిప్రాయానికి రావాలని సూచిస్తున్నారని ఇది సబబు కాదని మిర్చి ఎగుమతిదారులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మార్కెట్‌లో అడ్డగోలుగా కూలీ, కిరాయి ఖర్చులున్నాయని, అందుకే ఎగుమతిదారులు దాచేపల్లి, వరంగల్, ఖమ్మం వైపు చూస్తున్నారని చెప్పారు. తాము ఎవరు తక్కువ కిరాయికి లారీ లోడింగ్‌కి పెడితే వారినే సంప్రదిస్తామని చెప్పారు. అలా కాకుండా ఎక్కువ కిరాయిని డిమాండ్ చేస్తున్న వారితో మాట్లాడుకోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎక్స్‌పోర్టర్లు ప్రశ్నిస్తున్నారు
Updated Date - Nov 14 , 2024 | 12:51 AM