ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాదక ద్రవ్యాలుగా దుర్వినియోగమయ్యే మందులను కట్టడి చేయాలి

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:19 AM

మాదక ద్రవ్యా లుగా దుర్వినియోగం అవుతున్న మందులను కట్టడి చేయా లని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు.

గుంటూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యా లుగా దుర్వినియోగం అవుతున్న మందులను కట్టడి చేయా లని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆమె డ్రగ్స్‌ ప్రమాదంపై సభలో చర్చకు తెచ్చారు. ఆమె మాట్లాడుతూ దేశంలో డ్రగ్స్‌ కట్టడి చేయడం పెద్ద సవాలుగా మారిందని, ఎంత కట్టడి చేస్తున్నా వివిధ రూపాల్లో అది యువతకు అందుబాటులో ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశా రు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి కట్టడికి కృషి చేస్తున్నా కూడా దానికి బానిసలైన యువత ‘కోడైన పాస్పేట్‌ సిరప్‌’ అనే డ్రగ్‌ను మత్తుమందుగా ఉపయోగిస్తున్నారని, దానిని కట్టడి చేయాలని కోరారు. కోడైన పాస్పేట్‌ అనే డ్రగ్‌పై 2016లోనే కేంద్రం నిషేధం విధించిందని ఆమె సభ దృష్టికి తెచ్చారు. గుంటూరులోని ఒక కాలేజీ ప్రాంగణంలో ఆ మందు సీసాలు కనిపించాయని ఆమె సభలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దీనిపై దృష్టి పెట్టి, కోడైన ఎక్కడ నుంచి లభిస్తుంది, ఫార్మా కంపెనీ, మెడికల్‌ షాపుల మీద దృష్టి పెట్టి వీటిని అరికట్టాలని కోరారు.

Updated Date - Nov 19 , 2024 | 01:19 AM