ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:51 AM

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాలకు అత్యంత దగ్గరగా ఉన్న సూర్యలంక పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు

బాపట్ల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రెండు తెలుగురాష్ర్టాలకు అత్యంత దగ్గరగా ఉన్న సూర్యలంక పర్యాటక కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలలో బుధవారం తొలిసారిగా మాట్లాడిన ఎమ్మెల్యే వేగేశన పర్యాటక రంగ అభి వృద్ధిపై వివరించారు. బాపట్ల తీరం నుంచి చీరాల సముద్రతీరం వరకు బ్రిటీష్‌కాలంలో 80 అడుగుల వెడల్పు గల రాజదండు రోడ్డును ఏర్పాటు చేశారన్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్‌ మీద వంతెన అభివృద్ధి చేసి ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ రోడ్డు నిర్మిస్తే పర్యాటక కేంద్రాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. సుమారు 14 నుంచి 15 కిలోమీటర్ల పొడువు ఉన్న ఈ రోడ్డు అభివృద్ది చేయాలని ఇప్పటికే ఈప్రాంతంలో 4 నుంచి 5 ఫైవ్‌ స్టార్‌ హోటళ్ళు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ నుంచి నార్కెట్‌పల్లి మీదగా పర్చూరు, నరసరావుపేట, చీరాల కలుపుతూ నిర్మిస్తున్న రోడ్డు ఏడాదిలో పూర్తవుతుందన్నారు. దీనివల్ల పర్యాటకులు హైదరాబాద్‌ నుంచి కేవలం 4 గంటల సమయంలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. దీని కోసం సరైన వసతులు కల్పించే దిశగా టూరిజం అభివృద్ది చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం శ్రీశైలం, బాపట్ల, సంగమేశ్వరం, గోదావరి బీచ్‌లను అభివృద్ది చేసేందుకు 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే నరేంద్రవర్మ అసెంబ్లీలో వివరించారు.

Updated Date - Nov 21 , 2024 | 12:51 AM