ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కృష్ణా - గుంటూరు గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:20 PM

కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఈ ఎన్నిక కోసం తాజా ఓటర్‌ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది.

గుంటూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఈ ఎన్నిక కోసం తాజా ఓటర్‌ జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. ఆ మేరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి వివేక్‌ యాదవ్‌ శుక్రవారం ఓటర్‌ జాబితాల రూపకల్పనకు షెడ్యూల్‌ని ప్రకటించారు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి ఎవరైతే పట్టభద్రులు ఉంటారో వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్‌ నమోదు చేయడం అనేది ఓటరు ఇష్టం.

ఫ సెప్టెంబరు 30వ తేదీన ఓటర్‌ జాబితాల రూపకల్పనకు నోటిఫికేషన్‌ని విడుదల చేస్తారు.

ఫ అక్టోబరు 16న మరోసారి రీపబ్లికేషన్‌ చేస్తారు.

ఫ అక్టోబరు 25న రెండో రీపబ్లికేషన్‌ చేస్తారు.

ఫ నవంబరు 6వ తేదీ వరకు ఫారం-18, 19లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఫ నవంబరు 20వ తేదీ లోపు ముసాయిదా ఓటర్ల జాబితాలను ముద్రిస్తారు.

ఫ నవంబరు 23వ తేదీన ముసాయిదా ఓటర్‌ జాబితాలు ప్రకటిస్తారు.

ఫ నవంబరు 23 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

ఫ డిసెంబరు 25వ తేదీన క్లెయిమ్‌లు, అభ్యంతరాలు పరిష్కరించి సప్లిమెంట్‌ ఓటర్‌ జాబితాలను ముద్రిస్తారు.

ఫ డిసెంబరు 30వ తేదీన తుది ఓటర్ల జాబితాని ప్రచురిస్తారు.

Updated Date - Jul 26 , 2024 | 11:21 PM

Advertising
Advertising
<