ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గుంటూరు తూర్పులో కూటమి విజయం తథ్యం

ABN, Publish Date - May 16 , 2024 | 12:57 AM

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూట మి విజయం తథ్యమని కూటమి అభ్యర్థి మొహమ్మద్‌ నసీర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న నసీర్‌, పక్కన డేగల, ఎమ్మెల్యే శ్రీదేవి

గుంటూరు, మే 15(ఆంధ్రజ్యోతి): గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూట మి విజయం తథ్యమని కూటమి అభ్యర్థి మొహమ్మద్‌ నసీర్‌ అన్నారు. టీడీపీ తూర్పు కార్యాలయంలో బుఽధవారం టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వ రరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, టీడీపీ నేత షౌకతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్‌ మాట్లాడు తూ పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎండను లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయ డం గొప్ప విషయమన్నారు. గడిచిన రెండు నెలలుగా తనకు తోడుగా వుండి గెలుపునకు కృషి చేసిన మూడు పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. కూటమి ప్రభంజనాన్ని ఎవరూ అపలేరన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించి, రాక్షస పా లనతో ప్రజలను పీడించిన వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ముందుకొచ్చి కూటమివైపు నిలిచారన్నారు. వైసీపీ నేతలు ఓటమి భయంతో రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై దాడులు చేస్తున్నార న్నారు. తూర్పు నియోజకవర్గంలో ఆటో నగర్‌లో షాపులను తగలబెట్టారని, దొంగ ఓట్లను అడ్డగించినందుకు బూత ఏజెంట్‌ చెయ్యి విరగ్గొట్టారని, నసీర్‌ అనే వృద్ధుడిపై ముస్తఫా కుమారుడు దాడికి పాల్పడి కత్తితో బెదిరించారని తెలిపారు. వైసీపీ ఎన్ని చేసినా కూటమిని ఎవరూ ఆపలేరన్నారు. కార్యక్రమంలో దయారత్నం, సత్యం, కాలం, ఐల శ్రీనివాస్‌, గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 12:57 AM

Advertising
Advertising