ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇక.. ఎన్టీఆర్‌ జలసిరి

ABN, Publish Date - Nov 14 , 2024 | 01:24 AM

అటకెక్కిన బోర్ల నిర్మాణ పఽథకానికి కూటమి ప్రభుత్వం ఊతం ఇచ్చింది. ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని పునరుద్ధరించింది.

బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధుల కేటాయింపు

రైతుల ఆశలు ఫలించినట్లే.. బోర్ల నిర్మాణానికి చర్యలు

ఐదేళ్లుగా వైసీపీ హయాంలో అటకెక్కిన బోర్ల నిర్మాణం

ఎన్టీఆర్‌ జలసిరి.. భూగర్బ జలాలతో పంటలు పండించుకునే వారికి వరం. రైతులకు బోరు బావులతో సాగు నీటి భరోసా కల్పించేలా.. చిన్న, సన్న కారు రైతుల వ్యవసాయ భూమిని సేద్యానికి అనుకూలంగా మార్చేందుకు భూగర్భ జలాలను సమవర్ధవంతంగా సద్యినియోగం చేసుకునేలా బోర్ల నిర్మాణం పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లో ఈ పథకంలో రైతులకు ఉచితంగా బోర్లు వేయించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పథకం పేరును వైఎస్‌ఆర్‌ జలసిరిగా మార్చింది. అయితే అమలులో చిత్తశుద్ధి లోపించింది. ఈ పరిస్థితుల్లో రైతులు ఐదేళ్లుగా బోర్ల నిర్మాణం కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణతోనే వైసీపీ పాలకులు సరిపెట్టారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని పునరుద్ధరించింది. సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలోని సామాన్య రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఐదేళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయ బోర్లను తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

అటకెక్కిన బోర్ల నిర్మాణ పఽథకానికి కూటమి ప్రభుత్వం ఊతం ఇచ్చింది. ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని పునరుద్ధరించింది. త్వరలోనే ఎన్టీఆర్‌ జలసిరి బోర్ల నిర్మాణం పట్టాలెక్కనుంది. నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు వ్యవసాయ బోర్లు నిర్మించారు. సోలార్‌ పంపు సెట్లను ఏర్పాటు చేశారు. తిరిగి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్‌లోనే జలసిరికి నిధులు మంజూరు చేసింది. చిన్న సన్న కారు రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయం బోరు బావులను ఉచితంగా నిర్మించేందుకు నాడు టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ జలసిరికి శ్రీకారం చుట్టి వేలాది బోర్లను నిర్మించింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకం పేరు మార్చడంలో చూపిన శ్రద్ధ బోర్ల నిర్మాణంపై లేకుండా పోయింది. వైఎస్‌ఆర్‌ జలకళను ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పాలకులు అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపలేదు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈ పథకం అమలులో చతికిల పడింది. బోరు బావుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది రైతులు వీటి నిర్మాణం కోసం ఎదురు చూశారు. భూగర్భ జలాలను సమవర్ధవంతంగా సద్యినియోగం చేసుకునేందుకు ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని వైసీపీ పాలకులు ఐదేళ్లు రైతులకు అక్కరకు రాకుండా చేశారు. ఈ పరిస్థితుల్లో రైతుల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం తిరిగి ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో అమలు చేసినట్లుగా ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న సన్న, చిన్న కారు రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేసేందుకు సిద్ధమైంది. అర్హులైన రైతులకు బోరు నిర్మించడంతో పాటు సోలార్‌ పంపు సెట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో బోర్ల నిర్మాణంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జలసిరి పథకంలో బోర్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయింపుపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేలల్లో దరఖాస్తులు పెండింగ్‌లో..

టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం రైతుల కల మన వైఎస్‌ఆర్‌ జలకళ అనే నినాదంతో వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని రూపొందించింది. పథకానికి పేరు మార్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ బోర్ల నిర్మాణాన్ని అటకెక్కించింది. ఐదేళ్లు బోర్ల నిర్మాణంలో ప్రభుత్వం బొక్కాబోర్లాపడింది. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 15,341 మంది రైతుల దరాఖాస్తులను ఆమోదించినప్పటికీ బోర్ల నిర్మాణాన్ని విస్మరించింది. బోర్ల నిర్మాణం కోసం ఆశగా ఎదురు చూసిన అన్నదాతలకు ఆడియాసే మిగిలింది. ఈ పఽథకానికి ప్రధానంగా నిధుల కొరత వెంటాడింది. నిర్మించిన బోర్లకు పూర్తి స్ధాయిలో బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో బోర్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణం పూర్తయిన బోర్లకు విద్యుత్‌ కనెక్షన్‌లు ఇవ్వలేకపోయారు. దీంతో వందలాది బోర్లు నిరూపయోగంగా మారాయి. నెలల తరబడి విద్యుత్‌ కనెక్షన్‌లు ఇవ్వకపోవడంతో అవి పూడిపోయే పరిస్ధితులు నెలకొంటున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. జలసిరి పథకాన్ని జలకళగా మార్చిన వైసీపీ ప్రభుత్వం బోర్ల నిర్మాణాలను నామమాత్రంగా కూడా చేయలేదు. పల్నాడు జిల్లాలో 10,341 మంది రైతులు బోర్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేశారు. వీటిలో 8,371 దరఖాస్తులను ఆమోదించినా 1,179 బోర్లు మాత్రమే నిర్మించారు. బాపట్ల జిల్లాలో 4524 దరఖాస్తులకు 3,728 ఆమోదించారు. వీటిలో భూగర్భ జలాల లభ్యతకు సంబంఽధించి 2279 దరఖాస్తులపైనే సర్వే పూర్తి చేశారు. సర్వే నివేదిక ఇచ్చిన వాటిలో 2105 బోర్లు నిర్మాణానికి అనుమతించారు. వీటిలో 1779 బోర్లకు పరిపాలన అనుమతి రాగా 896 బోర్లను మాత్రమే నిర్మించారు. వీటిలో 63 బోర్లు విఫలమైనట్టు గుర్తించారు. 42 బోర్లకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు. గుంటూరు జిల్లాలో 476 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా 386 ఆమోదించారు. 181 భూగర్భ జలాల లభ్యతకు సంబంఽధించి సర్వే పూర్తి చేశారు. సర్వే నివేదిక ఇచ్చిన దరఖాస్తులలో 197 బోర్లు నిర్మాణానికి అనుమతిచ్చారు. వీటిలో 170 బోర్లకు పరిపాలన అనుమతి ఇచ్చారు. 133 బోర్లను మాత్రమే నిర్మించగా వీటిలో 34 బోర్లు పనిచేయడంలేదని నిర్ధారించారు. 44 బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు.

Updated Date - Nov 14 , 2024 | 01:43 AM