ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పడవ రేవులకు గిరాకీ

ABN, Publish Date - Nov 13 , 2024 | 01:24 AM

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ని పడవ, బల్లకట్టు రేవులకు గిరాకీ పెరిగింది. రెండు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన వేలం మంగళవారం విజయవంతంగా పూర్తయ్యింది.

వల్లభాపురానికి ఒక్కరు కూడా రాలేదు

గుంటూరు సిటీ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో ని పడవ, బల్లకట్టు రేవులకు గిరాకీ పెరిగింది. రెండు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన వేలం మంగళవారం విజయవంతంగా పూర్తయ్యింది. జడ్పీ డిప్యూటీ సీఈవో చొప్పర కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ వేలంలో రేవులు దక్కించుకునేందుకు పలువురు పోటీపడ్డారు. పెద్దగా ప్రాధాన్యం లేదనుకున్న అచ్చంపేట మండలంలోని రేవులకు భారీ మొత్తం చెల్లించేందుకు పలువురు ముందుకు వచ్చారు. అచ్చంపేట మండలం చామర్రు పడవ రేవుకు కనీస ధర రూ.1.15 లక్షలు నిర్ణయించగా, దానిని రూ.2.12 లక్షలకు జీ రామయ్య దక్కించుకున్నారు. చింతపల్లికి రూ.91667 అని నిర్ణయించగా, రూ.96000కు రమేష్‌ దక్కించుకున్నారు. గింజుపల్లికి 54,167 అని నిర్ణయించగా కే వసంతారావు 3.50 లక్షలకు దక్కించుకున్నారు. తాడువాయి రేవుకు రూ.4,72,083 కనీస ధర కాగా, రమేష్‌ అనే వ్యక్తి రూ.7 లక్షలకు దక్కించుకున్నారు. మాదిపాడు రేవుకు రూ.5,52,083 కనీస ధర కాగా, సతీశ్‌ కుమార్‌ అనే వ్యక్తి దానిని రూ.11.20 లక్షలకు దక్కించుకున్నారు. మాదిపాడు బల్లకట్టుకు రూ.4,16,667 కనీస ధరకాగా అబ్దుల్‌ సత్తార్‌ అనే వ్యక్తి రూ.4.27 లక్షలకు దక్కించుకున్నారు. మాచవరం మండలం లోని గోవిందాపురం బల్లకట్టుకు రూ.3,33,333 కనీస ధరగా నిర్ణయించగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 3,45,000కి దక్కించుకున్నారు. అమరావతి మండలం లోని దిడుగు పడవ రేవుకు రూ.2,77,083 కనీస ధర కాగా చంద్రశేఖర్‌ అనే వ్యక్తి రూ.2,88,000కు దక్కించుకున్నారు. ధరణికోట పడవ రేవుకు రూ.20,833 కనీస ధరగా నిర్ణయించగా, గోవింద్‌ అనే వ్యక్తి రూ.76,000కు దక్కించుకున్నారు. కొల్లిపొర మండలంలోని వల్లభాపురం రేవుకు ఎవరూ ముందుకు రాలేదని కృష్ణ తెలిపారు.

Updated Date - Nov 13 , 2024 | 01:24 AM