ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్..

ABN, Publish Date - Oct 05 , 2024 | 03:44 PM

ప్రభుత్వం వేరు, పార్టీ వేరని, ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాల్లో పరిమితులకు మించి పార్టీ నాయకులు తలదూర్చవద్దంటూ సొంత పార్టీ నాయకులను హెచ్చరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎంత స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నారో రాష్ట్రప్రజలకు అర్థమైంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా..

Pawan Kalyan

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక సభతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టినే కాకుండా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారనే చర్చ జరుగుతోంది. ఇప్పటిరవకు పవన్ కళ్యాణ్‌పై ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనలో స్థిరత్వం లేదని, చెప్పిన మాటకు కట్టుబడి ఉండరంటూ ఎన్నికల ముందు వరకు రాజకీయ పార్టీ నాయకులతో పాటు మరికొందరు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసేవారి శాతం కొంతవరకు తగ్గింది. ఎన్నికల్లో వంద శాతం సక్సెస్ రేటు సాధించడంతో అప్పటివరకు విమర్శలు ఎదుర్కొన్న పవన్‌పై ప్రశంసల వర్షం కురిసింది. పవన్‌కు రాజకీయ అనుభవం లేకపోయినా.. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత నుంచి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టారు. అంతేకాదు ప్రభుత్వం వేరు, పార్టీ వేరని, ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాల్లో పరిమితులకు మించి పార్టీ నాయకులు తలదూర్చవద్దంటూ సొంత పార్టీ నాయకులను హెచ్చరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎంత స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నారో రాష్ట్రప్రజలకు అర్థమైంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన మంత్రిత్వ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో జనసేన అధ్యక్షుడిగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ సరికొత్త ఉద్యమానికి నాంది పలికారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభతో సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంతో పాటు డిక్లరేషన్‌ను రిలీజ్ చేయడంతో ఈ సభ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.

Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు


పవన్‌పై పాజిటివ్..

తిరుపతి వారాహి సభతో పవన్ దేశ వ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తులతో పాటు.. ధర్మ రక్షకులు, హిందూ సంఘాల ప్రతినిధుల దృష్టిని ఆకర్షించారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలనే అభిప్రాయాన్ని బహిరంగ సభ ద్వారా బలంగా చెప్పగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన, వారాహి డిక్లరేషన్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటివరకు జనసేన ఓ కులానికి పరిమితం చేయగా.. ప్రస్తుతం అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నట్లు తిరుపతి వారాహి సభ స్పష్టం చేస్తోంది. అన్ని మతాలను, ధర్మాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు తాను వెనుకాడబోనని, జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మం పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చుకోవడానికి దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఒకే ఒక్క సభతో పవన్ కళ్యాణ్ లక్షలాది మంది ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారనే చర్చ జరుగుతోంది.

Mantena: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన


సూటిగా.. స్పష్టంగా..

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇప్పటిరవకు అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహారిస్తూ వచ్చాయి. సెక్యులర్ పేరిట ఏ మతాన్ని భుజాన్న వేసుకోలేదు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇతర మతాలను గౌరవిస్తానంటూనే సనాతన ధర్మాన్ని హేళన చేసే వ్యక్తులను సహించబోనని స్సష్టం చేశారు. సెక్యులర్ ముసుగులో సనాతన ధర్మాన్ని అవమానించవద్దని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా.. భవిష్యత్తులో జనసేన పార్టీ మరింత బలాన్ని పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.


Minister Narayana: బుడమేరు ఆక్రమణలతో విజయవాడ ముంపునకు గురైంది

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 05 , 2024 | 03:44 PM