ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమాల డొంకలు కదులుతున్నాయ్‌..!

ABN, Publish Date - Dec 10 , 2024 | 01:17 AM

కూటమి ప్రభు త్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నాయ్‌...కానీ గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్య వహరించిన అక్రమార్కుల భరతం పట్టడం లేదన్న అసంతృప్తి ఇటు పార్టీ క్యాడర్‌లోనూ, ఇటు సామాన్య జనంలోనూ వ్యక్తమవుతూ వస్తోంది.

యద్దనపూడి మండల పరిధిలో పింఛన్‌ అర్హతలపై విచారణ చేస్తున్న యంత్రాంగం

ఫ రీసర్వే ఫిర్యాదుల పరిష్కారం దిశగా.. పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు

ఫ మెప్మా బోగస్‌ రుణాల విషయంలోనూ కదలిక

ఫ గత ప్రభుత్వ ఇసుక దోపిడీ నివేదిక ప్రభుత్వ పెద్దల చేతుల్లో

ఫ ఇప్పుడు పింఛన్ల వంతు.. త్వరలోనే నోటీసులు.. ఆ పై చర్యలు

(బాపట్ల, ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభు త్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నాయ్‌...కానీ గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వ్య వహరించిన అక్రమార్కుల భరతం పట్టడం లేదన్న అసంతృప్తి ఇటు పార్టీ క్యాడర్‌లోనూ, ఇటు సామాన్య జనంలోనూ వ్యక్తమవుతూ వస్తోంది. మూడు నెలల కిత్రం నుంచే ప్రతి విభాగంలోనూ గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై అంతర్గతంగా విచారణ మొదలయిం ది. రెవెన్యూ లాంటి విభాగాల్లో బాహా టంగా ప్రక్రియ కనబడితే మైనింగ్‌, మెప్మా, డీఆర్‌డీఏ, డ్వామా, సహకార సొసైటీలవంటి పలు శాఖలలో అంతర్గతంగా కసరత్తు చేసి అక్రమాల చిట్టాను తయారు చేశారు. వీటన్నింటి విషయంలో తుది నిర్ణయానికి రావడా నికి ముమ్మరంగా కసరత్తు జరుగు తోంది. మరోవైపు రేషన్‌ మాఫియా విషయంలో గతంలో పీడీ యాక్టు వరకు వెళ్లిన మాఫియా డాన్‌లు ఎవరూ అనే కోణంలో కూడా ఇప్పటికే ప్రత్యేక విభా గం జిల్లా యంత్రాంగాన్ని వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. అధికారం అండతో కులాసాగా దోపిడీ కి పాల్పడిన వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే వారి ఆగడాలకు సహకరించిన యంత్రాంగం ఏం జరుగుతుంది అనే కోణంలో విచా రణ చేస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయా శాఖల మూలాల్లోకి తీగలు లాగే ప్రక్రియ ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లనుంచే ప్రారంభం కాగా ఇప్పటికీ డొంకలు కదలడం మొదలయింది. అక్రమాలకు పాల్పడిన వారిపై, సహకరించిన వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది

తొలుత ఫ్రీహోల్డ్‌ భూముల అవకతవకలపై...

నిరుపేదలకు భూమిపై యాజమాన్యహక్కు కల్పించే పేరిట గత పాలకులు భూ అక్రమాలకు పాల్పడ్డారనే నిర్థారణకు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే వచ్చింది. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు రావడం, మండలాల వారీగా గత ఐదేళ్లలో ఫ్రీహోల్డ్‌ చేసిన భూముల వివరాలను జల్లెడ పట్టడంతో పాటు వాటిలో ఎన్ని రిజిస్ట్రేషన్‌ జరిగాయి అనే అంశంపై కూడా దృష్టిసారించారు. దాదాపు 250 ఎకరాల వరకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్‌ చేసినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలినట్లు సమాచారం. వీటిలో 72 ఎకరాల వరకు రిజిష్టర్‌ కూడా జరిగినట్లు అధికారులు తేల్చారు. ఇక రీసర్వే ప్రహసనంపై 72 గ్రామాల్లో సభలు నిర్వహిస్తే రికార్డు స్థాయిలో 4,280 అర్జీలు రావడంతో కంగుతినడం అధికారుల వంతైంది. ఈమొత్తం వినతుల్లో అక్రమాల పరంగా మేజర్‌గా జరిగినవి 258 వరకు గుర్తించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సుకు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో వాటిని కూడా జల్లెడ పట్టి అన్నింటిని క్రోడీకరించి చర్యల కొరడా విధించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది

మైనింగ్‌ విషయంలో శ్రీముఖాలు....

వైసీపీ ప్రభుత్వంలో సహజవనరుల దోపిడీ ఏ విధంగా జరిగిందో అందరికి తెలిసిందే. దీనిలో ప్రధాన వాటా ఇసుక దే. గత ప్రభుత్వంలో నిబద్ధతతో పనిచేసిన కొంతమంది అధికారులు ఇసుక అక్రమ తవ్వకాలు జరుపుతూ పట్టుబ డిన వారిపై జరిమానాల కొరడా విధించారు. అధికారం అండగా ఉండడంతో అప్పట్లో వాటిని పట్టించుకోకపోగా నోటీసులను సైతం లెక్కలేని తనంతో బుట్టదాఖలు చేసేశా రు. వీరిలో ఎక్కువమంది వైసీపీ కీలక నేతల అనుచరగణ మే. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ అక్రమాల నిగ్గు తేల్చడంతో పాటు జరిమానాలను పెనాల్టీతో ముక్కుపిండి వసూలు చేయడానికి కార్యస్థలం ఇప్పటికే సిద్ధం చేశారు. 29 కేసులకు సంబంధించి రూ.9 కోట్ల వరకు జరిమానా కట్టాల్సి ఉండగా పెనాల్టితో కలిపి మొత్తం రూ.49 కోట్లు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసే విధంగా చట్టపరంగా అడుగులేస్తున్నారు. జరిమానాతో సరిపెట్ట కుండా క్రిమినల్‌ కేసుల నమోదు విషయంలో సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు

బోగస్‌ రుణాలది మరో తంతు.,....

బినామీ గ్రూపులను ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రుణాలను తీసుకోవడం గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జరిగింది. ఒక్క బాపట్ల పరిధిలోనే ఈ తరహా అక్రమాలు దాదాపు రూ.2 కోట్ల వరకు జరిగినట్లు ఇప్పటికే అంతర్గత విచారణలో తేటతెల్లం కాగా, రేపల్లె పరిధిలో వెలుగు చూసి న అక్రమాలపై వైసీపీ ప్రభుత్వంలోనే అధికారులు విచారణ జరపగా వాటి వెనక కీలక నేతల పాత్ర ఉండడంతో ఆ నివేదికను అటకెక్కించారు. దాని బూజు దులిపి నివేదిక తయారు చేసే పనిని యంత్రాంగం రెండు నెలల కిత్రమే చేసింది. బోగస్‌ రుణాల విషయంలో నోటీసులు జారీ చేయ డం వివరణ అడగడం, చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక తయారు చేయడం కూడా ఇప్పటికే పూర్తయింది. ఇక చర్యలే తరువాయి అనే విధంగా మెప్మాలో పరిస్థ్థితి ఉంది

రేషన్‌ మాఫియా విషయంలోనూ....

రేషన్‌ దందాకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకట్ట వేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వ పెద్దలు ఉన్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా గత ప్రభుత్వంలో ఈ దందాను వ్యవస్థీకృతం చేయడంలో కీలకంగా వ్యవహరించిందెవరు అనే కోణంలో విచారణను ప్రారంభించారు. గతంలో ముగ్గురిపై పీడీయాక్టు ప్రతిపాద నలు చేయడం, రాజకీయ ఒత్తిళ్లతో వాటిని పక్కన పడేయ డం జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు పీడీయాక్టు ప్రతిపాదనలు సిద్ధమైన ఆ ముగ్గురి యాక్టివిటీస్‌పై సదరు విభాగాలు దృష్టి పెట్టడంతో పాటు వారి వెనక అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పెద్ద తలకాయలు ఎవర నే కోణంలో కూ డా విచారణ చేస్తున్నా రు.

ప్రస్తుతం పింఛన్ల వంతు...

గత ప్రభుత్వంలో అర్హులను వేధించడం, పార్టీ భజనపరులకు పెద్ద పీట వేస్తూ అర్హత లేకపోయినా సర్కారు సొమ్మును పెద్ద ఎత్తున దోచి పెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో ముఖ్యంగా సామాజిక పింఛన్ల విషయంలో మరీ అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. గతంలో ప్రాథమికంగా పింఛన్ల విషయంలో లబ్ధి పొందుతున్న అనర్హులెవరనే కోణంలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,600 వరకు తేలాయి. కానీ ప్రస్తుతం ఇదే అంశంపై రెండు రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుండడంతో ఈ సంఖ్య భారీగానే పెరగొచ్చని తెలుస్తోంది. ఇక సహకార సంఘాల్లో రుణాల దుర్వినియోగం విషయంలో దాదాపు పది సొసైటీలను ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియలో అధికారులు గుర్తించారు. వీటి విషయంలో కూడా చర్యల కోసం నివేదికలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక జగనన్న కాలనీల లబ్ధ్దిదారుల జాబితాను గత ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసి అత్యంత గోప్యంగా ఉంచింది. ప్రస్తుతం ఆ లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయి ఉన్న అధికారులకు భూసేకరణలో జరిగిన అవకతవకలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఇదే సమయంలో అనర్హులు సైతం పెద్ద సంఖ్యలో లబ్ధి పొందినట్లు నిర్ధారణకు వచ్చారు.

Updated Date - Dec 10 , 2024 | 01:17 AM