ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొనసాగుతున్న పోలీసు పికెటింగ్‌

ABN, Publish Date - May 19 , 2024 | 01:01 AM

మండలంలోని పలు గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది. ఇటీవల ఎన్నికల అనంతరం కొత్తగణేషునిపాడు గ్రామంలో ఇరువర్గాలు ఒకరి గృహాలపై ఒకరు రాళ్లు రువ్వుకొని ధ్వంసం చేసుకున్న విషయం విదితమే. రెండు రోజులపాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మాచవరం, మే 18: మండలంలోని పలు గ్రామాల్లో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది. ఇటీవల ఎన్నికల అనంతరం కొత్తగణేషునిపాడు గ్రామంలో ఇరువర్గాలు ఒకరి గృహాలపై ఒకరు రాళ్లు రువ్వుకొని ధ్వంసం చేసుకున్న విషయం విదితమే. రెండు రోజులపాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటి నుంచి గ్రామంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్ల లో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది. పిన్నెల్లి గ్రామంలో నెల రోజుల నుంచి పోలీసు పికెట్‌ కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం పెట్రోలు బాంబులు, రాళ్లు, మారణాయుధాలు ఇరువర్గాల గృహాల్లో దొరకడంతో అప్పటి నుంచి కూడా పోలీసులు సంఖ్య పెంచి పికెట్లు కొనసాగిస్తున్నారు. శనివారం ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి సిట్‌ అధికారులు విచారణకు వస్తున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు కొత్తగణేషునిపాడు గ్రామంలో ఉదయం నుంచి వారి కోసం ఎదురుచూశా రు. సిట్‌ అధికారుల బృందం ఆదివారం వస్తున్నారనే సమాచారం తెలియడంతో స్థానిక పోలీసు అధికారులు వెళ్లిపోయారు.

Updated Date - May 19 , 2024 | 01:01 AM

Advertising
Advertising