Deep Fake: నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో.. వ్యక్తిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
ABN, Publish Date - Jan 20 , 2024 | 04:22 PM
Deep Fake: సినీ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Deep Fake: సినీ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతన్ని ఏపీలో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు గతేడాది నవంబర్‌లో రష్మిక డీప్‌ఫేక్ వీడియో సృష్టించాడు. బ్రిటీష్- ఇండియన్ ఇన్ ప్ల్యూయెన్స్ అయిన జరా పటేల్ శరీరానికి రష్మిక ముఖం పెట్టి డీప్ ఫేక్ వీడియో తయారు చేశాడు. ఈ విషయంపై పలువురు ప్రముఖులు సీరియస్‌గా స్పందించారు. నిందితుడు వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్ 465, 469 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Updated Date - Jan 20 , 2024 | 04:23 PM