ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్‌జేడీ కార్యాలయం.. ప్రక్షాళన

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:35 AM

పాఠశాల విద్య ప్రాంతీయ కార్యాయం(ఆర్‌జేడీ)లో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు వెన్నుదన్నగా నిలుస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కలిగించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.

ఆఫీస్‌ బేరర్‌ సర్టిఫికెట్‌తో ఓ ఉద్యోగి పదేళ్లుగా విధులు

అక్రమాలకు అండగా ఉన్న వారి స్థానచలనానికి కార్యాచరణ

గుంటూరు(విద్య), నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్య ప్రాంతీయ కార్యాయం(ఆర్‌జేడీ)లో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు వెన్నుదన్నగా నిలుస్తున్న ఉద్యోగులకు స్థానచలనం కలిగించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే ఏడీ స్థాయిలో ఉన్న ఉద్యోగిని కమిషనర్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. మరో ఇద్దరు ఉద్యోగుల్ని కూడా బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మిగిలిన సిబ్బందిని దశలవారీగా బదిలీ చేయాలని నిర్ణయించారు. గుంటూరు డీఈవో కార్యాలయ ఆవరణలోని ఆర్‌జేడీ పరిధిలో గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఆయా జిల్లాల పరిధిలోని హెచ్‌ఎం స్థాయి ఉపాధ్యాయులు, ఎంఈవోల సర్వీస్‌ రూల్స్‌, ప్రైవేటు స్కూల్స్‌ గుర్తింపు, బీఈడీ, డీఈడీ కళాశాల నిర్వహణ, పనితీరు, తనిఖీలు, ప్రైవేటు స్కూల్స్‌లో అదనపు తరగతులకు అనుమతులు తదితర విషయాలను ఆర్‌జేడీ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ఇప్పటి దాక ఇక్కడ పనిచేసిన అధికారుల మెతక వైఖరిని అడ్డం పెట్టుకుని ఉద్యోగులు చెలరేగిపోయారన్న విమర్శలున్నాయి. అక్రమ పద్ధతుల్లో సంవత్సరాల తరబడి ఇక్కడే తిష్టవేసి సంపాదనలో మునిగిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటీవల బాధ్యతలు చేపట్టిన కార్యాలయ అధికారి ఉద్యోగులపై అక్రమాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. కొన్ని విషయాల్లో ఆయన్ని సైతం తప్పుదోపట్టించేందుకు ఉద్యోగులు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన కార్యాలయ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు సంఘాల నాయకులు చెబుతున్నారు.

ఫ ఇక్కడ కీలకంగా పనిచేసే ఓ ఉద్యోగి ప్రకాశం జిల్లా నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. జిల్లాకు చెందిన ఓ సంఘం నేత నుంచి ఆఫీస్‌బేరర్‌ సర్టిఫికెట్‌ తీసుకువచ్చి దాదాపు పదేళ్ళుగా కార్యాలయంలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. వాస్తవానికి ప్రకాశం జిల్లాకు చెందిన ఈ ఉద్యోగికి గుంటూరు జిల్లాకు చెందిన ఉద్యోగ సంఘ నాయకుడు ఇచ్చే ఆఫీస్‌ బేరర్‌ సర్టిఫికెట్‌ ఉపయోగపడదు. అయితే అధికారుల్ని మాయచేసి ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతున్నాడు. కార్యాలయంలోని సెక్షన్లలో ఎవరి ఫైల్‌ ఎక్కడ ఉంది.. దాని స్థితి ఏమిటి.. పరిష్కారానికి ఎంత చెల్లించాలనేది ఈ ఉద్యోగి నిర్ణయిస్తాడని సమాచారం.

ఫ ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన మరో ఇద్దరు ఉద్యోగాలు దాదాపు ఐదేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. కార్యాలయానికి పనుల కోసం వచ్చే వారిని విభాగాలకు తీసుకెళ్ళి బేరాలు కుదర్చడంలో వీరుదిట్ట అనే ఆరోపణలు ఉన్నాయి.

ఫ కార్యాలయంలో సూపర్‌మెన్‌గా పేరున్న ఓ ఉద్యోగి దాదాపు ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ సూపర్‌మెన్‌ అక్రమాలు సూపర్‌గానే ఉంటాయన్న ఆరోపణలున్నాయి. ప్రతి ఫైలుకు రేటు పెట్టి వసూలు చేస్తాడని సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ఎక్కువ కాలం ఇతర జిల్లాల్లో ఇన్‌చార్జీలుగా పనిచేశారు. దీంతో ఈ సూపర్‌మెన్‌ ఫైల్స్‌ను ఏకంగా అఽధికారి పనిచేసే వద్దకే తీసుకెళ్లి పరిష్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఫ డీఈడీ కళాశాల గుర్తింపు, రెన్యువల్‌లో హైదరాబాద్‌లో జరిగిన అక్రమ వసూళ్ల విషయంలో గుంటూరు ఆర్‌జేడీ కార్యాయలంలో పనిచేసిన ఓ అధికారి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. వినుకొండ ప్రాంతానికి చెందిన ఓ డీఈడీ కళాశాల యాజమానితో కలిసి అక్రమ వసూలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అధికారికి కర్త, కర్మ, క్రియగా పని చేసిన ఉద్యోగులు ఇప్పటికీ ఆర్‌జేడీ కార్యాలయంలో ఉన్నారు. ఇలా దాదాపు పది మందిపైగా ఉద్యోగులు నాలుగు నుంచి పదేళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్నారు. ఆయా ఉద్యోగులకు దశలవారీగా స్థాన చలనం కలిగించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.

Updated Date - Nov 18 , 2024 | 01:35 AM