ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: తండ్రి ఉద్యోగం కోసం కూతురి మర్డర్ ప్లాన్‌.. తెలిస్తే షాకవ్వాల్సిందే

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:46 PM

Andhrapradesh: నకిరేకల్‌లో దారుణం జరిగింది. తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను ఓ యువతి హత్య చేసింది. ఆ తరువాత మృతదేహాలను కాల్వల్లో పడేసింది. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నకిరేకల్‌కు చెందిన పోలరాజు మృతి చెందాడు. పోలరాజు ఉద్యోగం కోసం కుమార్తె కృష్ణవేణి మర్డర్ స్కెచ్ వేసింది.

Palnadu district

పల్నాడు, డిసెంబర్ 16: బంధాలు, బాంధవ్యాలకు నేటి సమాజంలో విలువ లేకుండా పోతోంది. డబ్బే ప్రపంచంగా లోకం మారిపోతోంది. డబ్బు, ఆస్తి కోసం ఎంత దూరం వెళ్లేందుకైనా ఏ మాత్రం ఆలోచించరు. డబ్బు ఉంటే చాలు ఇంకేది అవసరం లేదు అన్నట్లు సమాజం తయారైంది. డబ్బుల కోసం, ఉద్యోగాల కోసం ఎంతటికైనా దిగజారిపోతున్నారు. తమ మార్గానికి అడ్డు వస్తున్నారంటే అది కన్న తల్లిదండ్రులైనా, తోడబుట్టిన వారైనా వారిని అడ్డుతొలగించేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అనేక మంది ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. మరికొందరికి తండ్రి వారసత్వంగా అంటే తండ్రి హఠాత్తుగా మరణిస్తే ఉద్యోగం వస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తండ్రి.. సర్వీసులో ఉండి చనిపోతే కుమారులకు ఆ ఉద్యోగం వస్తుంది. అయితే తండ్రి ఉద్యోగం కోసం ఓ మహిళ చేయకూడని పని చేసి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తోడబుట్టువులు అని కూడా చూడాకుండా దారుణానికి పాల్పడింది. ఆమె చేసిన దారుణం చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకీ ఆ మహిళ చేసిన దారుణం ఏంటి.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆమె చేసిన పనికి ఎవరు బలి అయ్యారో ఇప్పుడు చూద్దాం.

AP News: భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ భార్యపై అమానుషం


జిల్లాలోని నకిరేకల్‌లో దారుణం జరిగింది. తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను ఓ యువతి హత్య చేసింది. ఆ తరువాత మృతదేహాలను కాల్వల్లో పడేసింది. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో నకిరేకల్‌కు చెందిన పోలరాజు మృతి చెందాడు. పోలరాజు ఉద్యోగం కోసం కుమార్తె కృష్ణవేణి మర్డర్ స్కెచ్ వేసింది. అన్న గోపి, తమ్ముడు రామకృష్ణను హత్య చేసి మృతదేహాలను గుంటూరు బ్రాంచ్ కెనాల్, గోరంట్ల మేజర్ కాలువలో పడేసింది. ఆ తరువాత పోలీసులకు లొంగిపోయింది.


ఆస్తి కోసం తోడబుట్టిన వారిని దారుణంగా హత్య చేసి కాలువలో పడేసిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్లుకు చెందిన పోలరాజు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం కూతురు కృష్ణవేణి ఘాతుకానికి పాల్పడింది. తన తండ్రి ఉద్యోగం తనకు కావాలనే ఉద్దేశంతో తన తోబుట్టువులైన గోపి, రామకృష్ణలను దారుణంగా చంపేసి మృతదేహాలను కాలువల్లో పడేసింది. గోపీ.. బొల్లాపల్లి స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. రామకృష్ణ నిరుద్యోగి. అయితే వీరిద్దరికీ తండ్రి ఉద్యోగం రాకుండా.. తనకే రావాలన్న ఉద్దేశంతో ఇద్దరినీ చంపేసి గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ఒకరిని , గోరంట్ల మేజర్ కాలువలో మరొకరిని పడేసింది.

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన


వారం రోజుల క్రితం ముప్పాళ్ల బ్రాంచ్ కెనాల్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభించిన నేపథ్యంలో... ఆ మృతదేహం ఇద్దరు సోదరులలో ఒకరిదిగా పోలీసులు అనుమానించగా.. సోదరి మర్డర్ స్కెచ్ బయటపడింది. ఈ ఘాతుకానికి పాల్పడిన కృష్ణవేణి పోలీసుల ఎదుట లొంగిపోయి.. చేసిన నేరాన్ని పోలీసులకు వివరించింది. అయితే తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను సోదరి ఇంత కిరాతకంగా చంపేయడం నకిరేకల్ వాసులను తీవ్రంగా కలిచివేసింది.


ఇవి కూడా చదవండి..

బాబోయ్.. ఈ టీ వెరీ కాస్ట్‌లీ

తెలంగాణ అసెంబ్లీ.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 12:57 PM