ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎందులో.. ‘స్కిల్‌’

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:17 AM

ఉపాధి కల్పన అనే ఊసే లేకుండా వైసీపీ ఐదేళ్ల పాలన సాగింది. దీంతో జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. యువతలో ఉన్న స్కిల్‌కు పదును పెట్టి వారు కోరుకున్న రంగంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని అమలు చేసే విధంగా కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది.

నైపుణ్య గణనకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌లో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం(ఫైల్‌ ఫొటో)

వయసుల వారీగా సర్వే

ఇప్పటికే యంత్రాంగానికి శిక్షణ పూర్తి

క్లస్టర్ల వారీగా సచివాలయ ఉద్యోగులతో ప్రక్రియ

ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు

(బాపట్ల, ఆంధ్రజ్యోతి)

ఉపాధి కల్పన అనే ఊసే లేకుండా వైసీపీ ఐదేళ్ల పాలన సాగింది. దీంతో జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. యువతలో ఉన్న స్కిల్‌కు పదును పెట్టి వారు కోరుకున్న రంగంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని అమలు చేసే విధంగా కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటికి తిరిగి వయసుల వారీగా స్కిల్‌ గణన చేపట్టడంతో పాటు వారి వివరాలను ఆనలైనలో నిక్షిప్తం చేసే విధంగా ప్రణాళికలు రచించింది. ఈ సర్వేను ఎలాంటి అవకతవకలకు ఆస్కారమివ్వకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి

తొలుత సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద భారీగానే నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ గణన పూర్తవగానే వయసుల వారీతో పాటు గ్రూపుల వారీగా విభజించి వారు కోరుకున్న రంగంలో ప్రభుత్వం శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి బాటను కూడా చూపనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడంతో నిరుద్యోగులలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నైపుణ్య గణనలో భాగంగా ఇప్పటికే చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న వారి వివరాలు కూడా యంత్రాంగం సేకరించనుంది. చదువుతో పాటు సమాంతరంగా వారికి ఇష్టం ఉన్న రంగంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి త్వరగా కల్పించవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇందుకోసం 15 నుంచి 59 ఏళ్ల వయసును ప్రామాణికంగా తీసుకుని గణన చేపట్టనున్నారు. సర్వేలో ప్రధానంగా విద్యార్హతలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులతో పాటు ప్రస్తుతం ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారు.. దేనిలో రాణించాలని ఉంది లాంటి సమగ్ర వివరాలను సర్వేలో భాగంగా నమోదు చేయనున్నారు.

50 ఇళ్లు యూనిట్‌గా ఒక్కొక్కరికి ఖాతా కేటాయింపు

50 ఇళ్లను యూనిట్‌గా తీసుకుని సర్వే చేపట్టనున్నారు. ఆధార్‌ నంబరు ఆధారంగా వివరాలు నమోదు ప్రక్రియ ఉండడంతో పాటు మ్యాపింగ్‌ కూడా చేస్తారు. సర్వే పూర్తి కాగానే పోర్టల్‌లో నమోదైన ప్రతి ఒక్కరికీ ఒక్కో ఖాతా నంబరును కేటాయిస్తారు. దాని ఆధారంగా ఆ పోర్టల్‌లోకి వెళ్లి మార్పులు, చేర్పులు చేసుకోవాలి అంటే సదరు అభ్యర్థి చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ సర్వే మొత్తం సచివాలయ సిబ్బంది ద్వారానే జరగనుంది. ఇప్పటికే మండలానికి ఇద్దరి చొప్పున ఎంపిక చేసి కలెక్టరేట్‌లో స్కిల్‌ గణనపై శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు మండలం యూనిట్‌గా అక్కడ సర్వేలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. మూడు మండలాలు మినహా శిక్షణ కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. వీరు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలి. 15-59 ఏళ్ల మధ్య వయస్కులను ఆరు కేటగిరీల్లో విభజించి నైపుణ్య గణన చేపట్టే విధంగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నవారికి అక్కడ నమోదు చేసిన వివరాల ఆధారంగా సదరు కంపెనీకి ఆమోదం ఉంటే శిక్షణ కూడా వారే ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. ఇది కాదనుకుంటే ప్రభుత్వమే సదరు కంపెనీలకు కావాల్సిన విధంగా తర్ఫీదునిచ్చి వారిని సిద్ధం చేయనున్నది.

భారీ సంఖ్యలోనే నమోదు....

వయసుల వారీగా చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్య దాదాపు మూడు లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా 18-19 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్య రెండు లక్షల వరకు, 20--29 మధ్య ఏడు లక్షల వరకు, 30--39 మధ్య 9 లక్షల వరకు, 40-49 మధ్య 8 లక్షల వరకు, 50--59 మధ్య 5 లక్షల వరకు వివరాలు పోర్టల్‌లో నమోదయ్యే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్కిల్‌ సర్వే ఆధార్‌కార్డు ఆధారంగానే జరగనుంది. స్కిల్‌ సర్వేలో భాగస్వామ్యం అయిన వారికి ప్రభుత్వం నుంచి ఎస్‌ఎంఎస్‌ రావడంతో పాటు వివరాలు సరిచూసుకునేందుకు పోర్టల్‌ ఖాతా లింకును కూడా అభ్యర్థి సెల్‌ఫోనకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ విధమైన స్కిల్‌ సర్వే జరగడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం దీర్ఘకాల వ్యూహంతోనే ఈ గణనకు తెరతీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో వయసుల వారీగా ఉన్న మానవ వనరుల లెక్క అధికారికంగా తేలడంతో పాటు నిరుద్యోగుల సంఖ్యపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఈ సర్వే ద్వారా కలుగుతోంది.

Updated Date - Nov 18 , 2024 | 01:17 AM