ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి కృషి

ABN, Publish Date - Dec 16 , 2024 | 12:53 AM

సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నట్లు ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ తెలిపారు.

రాజశేఖర్‌బాబును సన్మానిస్తున్న ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్రవర్మ తదితరులు

బాపట్ల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నట్లు ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ తెలిపారు. బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా సలగల రాజశేఖర్‌బాబు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌, బావుడా వైస్‌ చైర్మన్‌ ప్రఖర్‌జైన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అధ్యక్షత వహించారు. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నమ్మకంతో సలగల రాజశేఖర్‌బాబును బావుడా చైర్మన్‌గా ముఖ్యమంత్రి నియమించారన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నివర్గాల వారికి సముచిత స్థానం కల్పించి పదవులు ఇస్తున్నట్లు చెప్పారు. బావుడా చైర్మన్‌ సలగల మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి సహకారం, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కృషితో టీడీపీలో చేరానన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా చేయకలిగిన ప్రతిపని చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి, పెద్దల ఆశీస్సులతో ముందుకెళ్తానన్నారు. రాష్ర్టాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ర్టాభివృద్ధి కాంక్షించే వారంతా టీడీపీ పక్షాన ఉండి పని చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా సలగలను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్‌, బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ నారాయణ, జనసేన నాయకురాలు గుంటుపల్లి తులసీకుమారి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థనరెడ్డి, రాష్ట్ర మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మానం విజేత, నియోజకవర్గ పరిశీలకులు సాంబిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పమిడి భాస్కరరావు, కళ్ళం హరినాథరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శులు తానికొండ దయాబాబు, పల్లం సరోజని, ఎస్సీసెల్‌ నాయకులు బడుగు నాగేశ్వరరావు, దగ్గుమల్లి కిరణ్‌కుమార్‌, సు భాషణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2024 | 12:53 AM