ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సహకార.. ఎన్నికలేనా?

ABN, Publish Date - Nov 13 , 2024 | 12:59 AM

రైతుల ప్రయోజానాలే పరమావధిగా సొసైటీలు పనిచేయాలి. అయితే ఇందుకు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. రైతులకు సొసైటీలకు మధ్య దూరం పెంచే నిర్ణయాలతో సరిపెట్టింది.

జొన్నలగడ్డ సోసైటీ భవనం

ఎన్నికలపై ఆసక్తి చూపని ప్రభుత్వం

త్రి సభ్య కమిటీల కొనసాగింపునకు కసరత్తు

ఐదేళ్లుగా అధికారుల చేతిలో సొసైటీల నిర్వహణ

(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)

రైతుల ప్రయోజానాలే పరమావధిగా సొసైటీలు పనిచేయాలి. అయితే ఇందుకు గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. రైతులకు సొసైటీలకు మధ్య దూరం పెంచే నిర్ణయాలతో సరిపెట్టింది. సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకుండా దొడ్డిదారిన కమిటీలను నియమిస్తూ కాలయాపన చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 167 సహకార సంఘాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తుందని రైతులు ఆశించారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం నియమించిన త్రి సభ్య కమిటీలు రాజీనామా చేశాయి. అయితే సొసైటీల ఎన్నికలను నిర్వహించేందుకు కూటమి

ప్రభుత్వం కూడా ఆసక్తి చూపడంలేదన్న వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. ఈ మేరకు కమిటీలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. సొసైటీలకు ఎన్నికలకు సంబంధించి వారీగా సభ్యులను గుర్తించాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉండటంతో కొత్త ఓటర్ల జాబితాలు రూపొందించే వరకు ప్రత్యేక పాలన కొనసాగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సహకార వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొంత కాలం ఎన్నికలు వాయిదా పడినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. సొసైటీల నిర్వహణ ప్రస్తుతం అధికారుల చేతిలో ఉంది. ముగ్గులు, లేదా ఐదుగురు అధికారులను సొసైటీలకు

నామినేట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ముగ్గురా.. ఐదుగురా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

2019 నుంచి అధికారుల చేతుల్లోనే సొసైటీలు..

సహకార సంఘాలకు చివరగా 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 2018లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధ్యక్షుల పదవీ కాలాన్ని 2019 వరకు పొడిగించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా సొసైటీల్లో ప్రత్యేక పాలన ఏర్పాటు చేసింది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలలకొకసారి త్రి సభ్య కమిటీల పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది.

ఇష్టారాజ్యంగా కమిటీలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొన్ని సహకార సంఘాలలో త్రి సభ్య కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయన్న విమర్శలున్నాయి. కొన్ని చోట్ల రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. రాజకీయ కారణాలతో ఎప్పటి నుంచో పని చేస్తున్న ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకున్నాయి. కొన్ని త్రి సభ్య కమిటీలు ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి అక్రమ మార్గంలో ఉద్యోగులను నియమించుకున్నాయన్న ఆరోపణలున్నాయి. ఆయా నియామకాలకు పాత తేదీలను నమోదు చేసుకుని మినిట్స్‌ రాసుకున్నట్లు సమాచారం. ఎన్నికలు లేక పోవడంతో తాత్కాలిక కమిటీలు పలు అక్రమాలకు పాల్పడ్డాయన్న విమర్శలున్నాయి. పంట రుణాలు మంజూరులో

కూడా రాజకీయంగా కమిటీలు ఇబ్బందులకు గురిచేసినట్లు రైతులు వాపోతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:59 AM